కల్కి మూవీలో నాగ్ ఆశ్విన్ కృష్ణుడి పాత్ర కోసం ఆ స్టార్ హీరోను ఎందుకు తీసుకోలేదంటే..?
TeluguStop.com
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా( Kalki Movie ) ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆ సినిమా సాధించిన విజయం ముందు ప్రతి ఒక్క విజయం కూడా చాలా చిన్నదనే చెప్పాలి.
ప్రభాస్ కెరియర్ లో చేసిన మంచి సినిమాల్లో ఈ సినిమా కూడా నిలిచి పోతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కృష్ణుడి పాత్రకు( Krishna's Character ) సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్ ని కనిపించకుండా సినిమా షూట్ ని చేశాడు.
దానికి గల కారణం ఏంటి అంటే అతని ఫేస్ కనపడాల్సిన పనిలేదు. """/" /
అతని చెప్పే మాటలు వినిపిస్తే చాలు అని అందుకే అతని ఫేస్ ని చూపించలేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
మరి తను అలా ఆలోచించడం వల్లే ఆ పాత్రకి వేరే హీరోని అనుకోలేదు.
అలా కాకుండా కృష్ణుడి పాత్ర పేస్ కనిపించే విధంగా ఉండి ఇంకొంచెం నిడివి ఉన్నట్లైతే అందులో మహేష్ బాబుని ( Mahesh Babu )తీసుకునేవాడినేమో అంటూ నాగ్ అశ్విన్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం 'కల్కి 2' సినిమా( 'Kalki 2' Movie ) మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసుకున్న 'కల్కి 2' సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా కల్కి 2 సినిమా ద్వారా తనను తాను మరొకసారి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. ఆ విషయంలో సీరియస్ అవుతున్న ఫ్యాన్స్!