దోమలు కొందరినే ఎందుకు టార్గెట్‌ చేసి కుడతాయో తెలుసా?

వానాకాలం వచ్చేసింది.ఇక దోమలు, ఈగలు ఎక్కువగా వ్యాపించే కాలం.

సాధారణంగా దోమలతో చాలా సమస్యలు వస్తాయి.ఇవి రక్తాన్ని పీల్చడమే కాకుండా.

వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి.ప్రత్యేకంగా డాక్టర్లు కూడా ఇళ్లు పరిసరాలను హైజినిక్‌గా ఉంటారు.

అలాగే, నీటి నిల్వలను కూడా ఉంచకూడదని సూచిస్తారు.కానీ, ఈ దోమలు కొందరినే టార్గెట్‌ చేసి కుడతాయి.

ఎప్పుడైన సాయంకాలం పార్క్‌లో కూర్చుంటే దోమలు తరచూ కుడతాయి.వారి ఇతరుల కంటే ఎక్కువ బాధపడాల్సివస్తుంది.

అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.దీనికీ ఓ సైంటిఫిక్‌ లాజిక్‌ ఉంది.

2014 ఏడాదిలో ‘టైం’ మెగజైన్‌లో డాక్టర్‌ జోనాధన్‌ డే, ప్రముఖ ఎంటామాలజిస్ట్, యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్లోరిడా మాస్కిటో నిపుణుడు వెల్లడించాడు.

కొంత మంది రక్తం అంటే దోమలు చాలా ఇష్టపడతాయట.అంటే వారి స్కిన్‌ ద్వారా కొన్ని కెమెకల్స్‌ ఇతరుల కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతాయో, అంటే లాక్టిక్‌ యాసిడ్‌ వంటి కెమికల్స్‌ దోమలను ఆకర్షిస్తాయని ఆయన తెలిపారు.

అంతేకాదు ‘ఓ’ రక్తం గ్రూపు వారిని దోమలు ఎక్కువ ఆకర్షించి వారిని కుడతాయని ప్రూవ్‌ కూడా అయింది.

జిన్స్‌లో ఉండే రక్తం వవర్గాలు కూడా దీనికి మరో కారణం.కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ప్రధానం చేసుకుని దోమలు వారిని కుడతాయని డాక్టర్‌ జోనాధన్‌ తెలిపారు.

అదేవిధంగా గర్భవతులను, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్‌ రేట్స్‌ అధికంగా ఉంటాయి.అందుకే వీరిని కూడా దోమలు టార్గెట్‌ చేస్తాయి.

అందుకే వీరు కూడా తరచూ దోమ కాటుకు గురవ్వక తప్పదు. """/"/ అంతేకాదు నలుపు రంగు దుస్తులు వేసుకునే వారంటే కూడా ఈ ఆడ దోమలకు వచ్చి కుట్టమని సంజ్ఞలు చేసినట్లని డే తెలిపారు.

ఫోర్టీస్‌ మెమోరియాల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ గురుగ్రాం కు చెందిన న్యూరాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ గుప్తా కూడా ఓ పత్రికకు దోమ కాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.

‘ఓ’ రక్తం కలిగిన వారినే దోమలు ఎక్కువ కుడతాయి.కొంతమంది వ్యక్తులకు చెమట ద్వారా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి.

వారిని దోమలు కుడతాయి.ఎక్కువ శాతం చెమట వచ్చేవారిలో లాక్టిక్‌ యాసిడ్, అమ్మోనియా ఎక్కువ స్రవించడం వల్ల కూడా మరో కారణం.

"""/"/ కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎక్కువగా బయటకి విడిచే వారిని.శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న వ్యక్తులు.

ఆల్కహాల్‌ ఎక్కువ తీసుకునేవారిని, ముఖ్యంగా బీర్‌ తాగేవారిలో బాడీ టెంపరేచర్‌ అధికంగా ఉంటుంది.

వీరు కూడా దోమ కాటుకు గురికాక తప్పదు.మీలో ఎవరికైనా దోమలు ఎక్కువ కుడితే.

రక్షణ ఎక్కువ ఇచ్చే దుస్తులను వేసుకోవాలి.అంటే అథ్లెట్‌ల కోసం లేదా ఫిషర్‌మెన్‌లకు ఉపయోగించే రకం దుస్తులు టైట్‌గా నేస్తారు.

లైట్‌వెయిట్‌గా ఉంటాయి.అటువంటి బట్టలను ఎంచుకోవడం మంచిది.

వార్2 సినిమా గురించి క్రేజీ అప్ డేట్ వైరల్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అలా ఉంటుందా?