House Warming : గృహ ప్రవేశం సమయంలో పాలను ఎందుకు పొంగిస్తారు..?

కొత్త ఇల్లు కట్టిన లేదా అద్దె ఇల్లుకి మారిన చాలామంది పాలు పొంగించి పరమాన్నం తయారుచేసి ఆ తర్వాత పూజ చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు.

ఆ తర్వాతనే మిగతా పనులు మొదలుపెడతారు.అద్దె ఇంట్లో పరమాన్నం చేసినా, చేయకపోయినా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం( House Warming ) అయిన సందర్భంలో అయితే కచ్చితంగా ఇంటి ఆడపడుచు పాలు పొంగించే సాంప్రదాయాన్ని పాటిస్తారు.

పాలు( Milk ) పొంగించే ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొత్త ఇంట్లో అడుగు పెట్టే సమయంలో పాలు పొంగించడం వలన ఇంట్లో, ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.

అలాగే గృహప్రవేశం పూజ రోజున కొత్త వంటశాలలో కొత్త పాత్రలో పాలు పోసి ముందుగా వాయువుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగించాలి.

"""/" / ఇక పాలు పొంగిన తర్వాత క్షీరాన్నం తయారు చేసి సత్యనారాయణ వ్రత కథ( Satyanarayana Vrat ) పూజలో దేవతకు నైవేద్యంగా సమర్పించాలి.

ఇక హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు కూడా పరమాన్నం ప్రసాదంగా పెట్టాలి.ఆ తర్వాత వారి ఆశీస్సులు తీసుకోవాలి.

అయితే ఇల్లు వేడెక్కుతున్న సమయంలో స్త్రీలు కొత్త ఇంటి వంట గదిలో( Kitchen ) కొత్త పాత్రలో పాలు కాచాలని పురాణాలు చెబుతున్నాయి.

అలా కాచేటప్పుడు మరుగుతున్న పాలలో బియ్యం వేసి పరమాన్నాన్ని ప్రసాదంగా తయారు చేయాలి.

ఇది పూజ చేసే సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది.గృహప్రవేశం వేడుకకు పాలు మరిగించడం కూడా చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది.

"""/" / అందుకే పాలు పొంగిస్తారు.కొత్త ఇల్లు( New Home ) ప్రతి ఒక్కరికి కూడా ఒక కల.

ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సొంత ఇల్లును ఏర్పాటు చేసుకుంటారు.

అయితే తమ కలల పంట సొంత ఇంట్లో అడుగు పెట్టడం అనేక గృహస్థులకు ప్రత్యేక అనుభూతి.

అలాగే జీవితంలో కొత్త ప్రారంభానికి ప్రతీక.అలాగే గృహప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది.

అలాగే ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ఇది సహాయపడుతుంది.అందుకే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు శుభ ముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వలన సుఖసంతోషాలు ఉంటాయి.

అదే విధంగా గృహప్రవేశ పూజా, పాలు పొంగించడం లాంటివి చేస్తే చాలా మంచిది.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..