చిరంజీవి కి సక్సెస్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఇప్పుడెందుకు సినిమాలు చేయడం లేదు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన అవార్డులే ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎంతో మంది స్టార్ హీరోలకి ఆదర్శంగా నిలిచాడు.
ఇక ఇలాంటి చిరంజీవి ఒకప్పుడు మంచి విజయాలు అందుకున్నాడు.ఇక ఇప్పుడు కూడా సోషియో ఫాంటసీ జానర్ లో విశ్వంభర( Vishwambhara ) అనే మూవీ చేస్తున్నాడు.
"""/" /
ఇక 70 సంవత్సరాల వయసులో కూడా తను ఒక యంగ్ కుర్రాడిలా కష్టపడడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక ప్రతి సినిమా విషయంలో తను ఇలాగే కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటాడు.
కాబట్టి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ గానే కొనసాగుతూ ఉంటాడు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సూపర్ సక్సెస్ లను అందించిన దర్శకులలో వివి వినాయక్( VV Vinayak ) ఒకరు.
అయితే ఇప్పుడు ఈయన సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు.దాంతో చిరంజీవి తోనే మరో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి సంబంధించిన కథను కూడా చిరంజీవికి వినిపించారట. """/" /
కానీ చిరంజీవి మాత్రం ఆ కథ విషయంలో అంత సాటిస్ఫాక్షన్ పొందలేదని తెలుస్తుంది.
ఇక దాంతోపాటుగా చిరంజీవి అతనితో ఒక సినిమా చేస్తానని చెప్పారట.కానీ అది ఒరిజినల్ స్టోరీ కాకుండా ఏదైనా ఒక రీమేక్ సినిమాని తనతో చేయాలని అనుకుంటున్నాడట.
ఇక ఇంతకుముందు ఆయనతో చేసిన రెండు సినిమాలు కూడా రీమేక్ లే కావడం విశేషం.
ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాయి.అందులో ఒకటి ఠాగూర్ సినిమా కాగా, ఇంకొకటి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా కావడం విశేషం.
వారసుడు కొడుకే అవ్వాలా? కూతుర్లు కారా? చిరంజీవికి భారీ షాకిచ్చిన యాంకర్!