రజినీకాంత్ తో నటించడానికి ఇబ్బంది పడ్డ ఏకైక హీరోయిన్
TeluguStop.com
నటనకు నటన.అంతకు మించి మంచి తనం.
మొత్తంగా మంచి సినిమాలు చేసి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.తమిళ నాట పుటి పెరిగినా.
అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించేది మీన.అందుకే తెలుగు జనాలు ఆమె ఓన్ చేసుకున్నారు.
తెలుగింటి ఆడపడుచుగా భావించారు.ఆమె తెలుగు అమ్మాయి కాదంటే చాలా మంది నమ్మేవారు కాదు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.మీనా ఇక్కడి జనాలతో ఎంట అటాచ్ మెంట్ కలిగి ఉందో.
నైంటీస్ లో ఆమె అగ్రతారగా వెలుగొందింది.తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది.
తమిళ సూపర్ స్టార్ రజీకాంత్ తో కలిసి మీనా నటించిన ముత్తు సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.
ఈ సినిమా జపాన్ లోనూ విడుదల అయ్యింది.ఈ సినిమా మీనా కెరీర్ కు మంచి మలుపుగా మారింది.
మీనా తొలిసారి రజనీతో కలిసి హీరోయిన్ గా నటించిన సినామ యజమాన్.1993లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రౌడీ జమీందార్‌గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో మీనా చాలా ఇబ్బంది పడిందట.దానికి కారణం అంతకు ముందు రజనీ హీరోగా నటించిన అన్బుళ్ల రజనీకాంత్ సినిమాలో బాల నటిగా చేసిందట.
అప్పుడు తనను మీనా అంకుల్.అంకుల్ అని పిలిచేదట.
ఆ సినిమాను ఎక్కువ శాతం రజనీ ఇంట్లోనే చిత్రీకరించారట. """/"/ అప్పుడు అంకుల్ అంటూ తిరిగిన ఆ అమ్మాయి ఇప్పుడు రజనీతో రొమాన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేదట.
అదే సమయంలో హీరోయిన్ గా తన కెరీర్ ను సూపర్ స్టార్ తో మొదలు పెడుతున్నాననే సంతోషం కూడా ఉండేదట.
"""/"/
సినామ యజమాన్ సినిమా షూటింగ్ సమయంలో మీనా.రజనీకాంత్ ను ఏమని పిలవాలో అర్థం కాలేదట.
అప్పట్లో అంకుల్ అని పిలిచేదాన్ని.ఇప్పుడు ఏమనాలి? అని ఆలోచించేదట.
రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చాలా సిగ్గుగా ఫీలయ్యేదట.అంతేకాదు.
తనతో సమానంగా నటించాలంటే అంత సులువు కాదు.అన్ని సీన్లు తనతో సిరిగ్గా చేయాలని భయపడేదట.
తన ఫస్ట్ షాట్ కంప్లీట్ కాగానే రజనీ మీనాకు కంగ్రాట్స్ చెప్పాడట.తను థ్యాంక్యూ సర్ అన్నదట.
ఆ తర్వాత ఇద్దరు చాలా కలివిడిగా సినిమా చేశారట.
పుష్ప 2 విషయం లో అతి జాగ్రత్త మొదటికే మోసం వస్తుందా..?