Mahesh Babu: ఆ డైరెక్టర్ అంటే మహేష్ బాబుకి ఎందుకు అంత కోపం… ఇంటికి వచ్చిన కనికరించలేదా?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వారితో మాత్రమే సినిమాలు చేయకుండా కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు.
ఇలా కొత్త వారికి అవకాశం ఇవ్వటం వల్ల వారు తమ టాలెంట్ బయటపెట్టి ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ప్రతి ఒక్క హీరో కూడా కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు కానీ మహేష్ బాబు (Mahesh Babu) మాత్రం కొత్తవారికి పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు.
"""/" /
ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్నటువంటి వారికి మాత్రమే కాకుండా పాత డైరెక్టర్లు అయినప్పటికీ ఎప్పుడూ వారితో సినిమాలు చేయకపోతే మహేష్ బాబు వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది.
ఈయన ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తెలుగు తమిళ సినిమాలను తెరకేక్కించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఓ డైరెక్టర్( Director ) గత కొన్ని సంవత్సరాల నుంచి మహేష్ బాబు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారట ఆయన తనకు సినిమా అవకాశం ఇస్తే తప్పకుండా తనతో సినిమా చేయాలని ఆ డైరెక్టర్ ఆరాటపడుతున్నప్పటికీ మహేష్ బాబు మాత్రం కనికరించలేదని తెలుస్తోంది.
"""/" /
ఆ డైరెక్టర్ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమా కథలతో మహేష్ బాబు దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి ఆ డైరెక్టర్ కి మాత్రం అవకాశం ఇవ్వలేదట.
ఒకసారి కథ బాగాలేదని మరోసారి కాల్ షీట్స్ లేవంటూ తరచూ తనకి నిరాశ కలిగిస్తున్నారని తెలుస్తోంది.
మరి మహేష్ బాబు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఇప్పటివరకు అవకాశం అందుకొనటువంటి ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు.
ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gawtham Vasudev Menon).ఈయన ఏం మాయ చేసావే సినిమా సమయం నుంచి మహేష్ బాబు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట అయితే మహేష్ బాబు మాత్రం ఈయనకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.
"""/" /
అలాగే ఎన్నోసార్లు ఇంటికి వెళ్లి ఆయన కాల్ షీట్స్ అడగడం లేదా ఏదైనా కథ చెప్పే ప్రయత్నాలు చేసిన ఎందుకనో ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మాత్రం కుదరడం లేదు భవిష్యత్తులోనైనా డైరెక్టర్ గౌతమ్ కు మహేష్ బాబు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా పూర్తి అవగానే ఈయన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.మరి ఈ సినిమాల తర్వాత అయినా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి అవకాశం కల్పిస్తారా లేదా వేచి చూడాలి.
ఈ సంవత్సరం స్టార్ హీరోలకు బాగా కలిసివచ్చిందా..?