శేఖర్ కమ్ముల సినిమాకు ఇన్ని కష్టాలు ఎందుకో?

టాలీవుడ్‌లో ‘ఆనంద్’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, ఆ తరువాత వరుసబెట్టి ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోయాడు.

శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే క్లాస్ ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు.అంతలా ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ పనులు ముగించేసి రిలీజ్‌కు రెడీ చేశాడు.

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని గతేడాదే రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల భావించాడు.

కానీ కరోనా దెబ్బకు ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కూడా కుదర్లేదు.

దీంతో వినాయక చవితి కానుకగా ఈ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

కానీ ఇప్పుడు మరోసారి వారు తమ నిర్ణయాన్ని మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.ఏపీలో థియేటర్ టికెట్ల అంశం కారణంగా ఈ సినిమా వినాయక చవితి కానుకగా రిలీజ్ కావడం లేదు.

ఇక ఈ సినిమాను సెప్టెంబర్ చివరినాటికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఏదేమైనా ఒక సినిమా ఇన్నిసార్లు వాయిదా పడటం ఏమాత్రం మంచిది కాదని పలువురు భావిస్తున్నారు.

ఈ సినిమాపై ఉన్న అంచనాలు ప్రేక్షకుల్లో తగ్గే అవకాశం ఉందని, అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే సినిమాకు కలిసొస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో వీలుకాకపోతే ఓటీటీల్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి.లవ్ స్టోరి కూడా ఈ తరహా స్ట్రాటెజీని వాడాల్సిందని, ఇప్పుడు రెంటికి చెడిందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదని, ఓటీటీ ఛాన్స్ మిస్ అయ్యిందని, వారు అంటున్నారు.

ఒకవేళ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా, సూపర్ హిట్ టాక్ ఉంటేనే సినిమాకు ప్లస్ అవుతుందని, అలా జరగకపోతే ‘లవ్ స్టోరి’ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా ‘లవ్ స్టోరి’ చిత్రానికి ఇన్ని కష్టాలు ఏమిటో అని శేఖర్ కమ్ముల అభిమానులు భాదపడుతున్నారు.

ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి రామ్ చరణ్ తప్పు చేశారా.. ఏం జరిగిందంటే?