చిరంజీవి కోసం చేసిన ఆ పని ఎల్బీ శ్రీరామ్ కెరీర్ ని దెబ్బ తీసిందా ?

మన టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అది తక్కువ విలక్షణ నటులలో ఒకరు ఎల్బీ శ్రీరామ్.

ఆయనకి సినిమా అంటే అమితమైన ఇష్టం.అందుకే మొదటగా నాటక రంగంలో ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో సైతం ఆయన కొన్నాళ్లపాటు పనిచేశారు.ఆ తర్వాత ఆ సినిమా రంగంలోకి ఎల్బీ శ్రీరామ్ గారు ఎంట్రీ ఇచ్చారు.

ప్రముఖ నటుడుగా సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించి ఆయన ఎదిగిన వైనం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు.

వాస్తవానికి ఎల్బీ శ్రీరామ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన రచయిత అంతే కాదు మాటల రచయిత కూడా అది కాకుండా దర్శకత్వం కూడా వహించిన అనుభవం ఆయనది.

ఎల్బీ శ్రీరాం రాసిన గజేంద్రమోక్షం అనే ఒక నాటిక ఇప్పటికే కొన్ని వేల సార్ల ప్రదర్శించబడిందంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే కిష్కిందకాండ అనే ఓ సినిమాకి ఆయన రచయితగా కూడా పని చేయగా ఇది ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు వేస్తూ బిజీ అయ్యారు ఎల్బీ శ్రీరామ్.

ఇక హలో బ్రదర్, హిట్లర్ లాంటి సినిమాలకు ఆయన మాటల రచయితగా కూడా పని చేసి ఎంతో మంచి పేరు కూడా గడించారు.

వాస్తవానికి చిరంజీవికి హిట్లర్ సినిమాకు మాటలు రాయడంతో ఆయన రచయితగా చాలా బిజీ అవుతారు అనుకున్న క్రమంలో ఆ సినిమాని అతనికి శాపంగా మారిందట.

ఈ సినిమాలో చిరంజీవి ఎక్కువగా సైలెంట్ గా ఉండే పరిస్థితి అందుకే అతనికి మాటలు తక్కువ రాయాల్సి వచ్చింది.

దాంతో ఆయనకు మళ్ళీ ఏ సినిమాలోను మాటల రచయితగా అవకాశాలు దొరకలేదట.ఇక ఆ తర్వాత ఎల్బీ శ్రీరామ్ రాసిన మరెన్నో సినిమాలు హిట్ గా నిలిచినప్పటికీ కమెడియన్ గా మరియు ఎమోషన్ సీన్స్ లో నటిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ఇక హిట్లర్ సినిమా హిట్ అయినప్పటికీ ఆయనకైతే మళ్లీ అవకాశాలు రాలేదు.ఆ తర్వాత తను పూర్తిగా రచయితగా మానేసి సినిమాల్లోనే బిజీ అవుతూ అలాగే నటుడుగా మారిపోయినట్టు చెప్పుకొచ్చారు.

"""/"/ నటుడిగా మారిన తర్వాత సైతం ఎల్బీ శ్రీరామ్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నఊరట.

మిధునం అనే సినిమా కూడా ముందుగా ఆయనే చేయాల్సి ఉందట కానీ తన స్థానంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించారు.

ఆ సినిమా కోసం ఏకంగా రెండేళ్ల సమయం వెచ్చించి అనేక విషయాల్లో పట్టు సాధించినప్పటికీ చివరికి ఆ సినిమా బాలు కి వెళ్లడంతో ఆయన చాలా డీలపడ్డారు.

ఇలా నటుడిగా, రచయితగా ఆయనకు ఏకకాలంలో ఫుల్ స్టాప్ పడటంతో ఆయన తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రస్తుతం బిజీగానే ఉంటున్నారు.

ట్రంప్ బెటరా.. బైడెన్ ఓకేనా : ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికన్లు ఏమనుకుంటున్నారంటే..?