కేటీఆర్ సార్ ! ఎందుకు ఈ మౌనం ?

టిఆర్ఎస్ పార్టీ లోనూ, అటు తెలంగాణ ప్రభుత్వంలోనూ, కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పగల నాయకుడు, వారసుడు కేటీఆర్ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే.

దీనికి తగ్గట్టుగానే ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వంలోనూ,పార్టీలోనూ తన ముద్ర స్పష్టంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

ఇక టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి కేటీఆర్ హవా బాగా పెరిగింది.

మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు.

ఇక సోషల్ మీడియాలోనూ కేటీఆర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వివిధ సమస్యలపై స్పందిస్తూ అప్పటికప్పుడే పరిష్కారం మార్గం చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉండేవాడు.

సెలబ్రిటీ సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించాడు. """/"/ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ, ఏదైనా పని జరగాలంటే కేటీఆర్ ప్రసన్నం చేసుకుంటే చాలు అనే విధంగా ఆయన తన స్థానాన్ని అతి తక్కువ కాలంలోనే పెంచుకున్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కేటీఆర్ లో గతంలోఉన్న ఉత్సాహం, దూకుడు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.

ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది.ఓవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది.

దీనిపై సీఎం కేసీఆర్ మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు.ఒకరకంగా చెప్పాలంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది.

ఇటువంటి సమయంలో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన కేటీఆర్ మౌనంగా ఉండిపోయారు.అసలు ఆయన ఈ విధంగా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలియక అంతా జుట్టు పీక్కుంటున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేలు మంత్రులు బయట తిరగలేని పరిస్థితి ఉంది. """/"/ఒకవేళ తిరిగినా ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ వారిని నిలదీస్తూ వివిధ సమస్యల పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇటువంటి సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తగిన వ్యూహరచనలు చేసి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఉన్న కేటీఆర్ స్పందించడం లేదు.

ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదం అవడమే కాకుండా, అనవసర వివాదం తెచ్చిపెడుతుందని కేటీఆర్ భావిస్తున్నారట.

అదీ కాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఎవరూ తలదూర్చవద్దని ఇప్పటికే కెసిఆర్ గట్టిగా హెచ్చరికలు చేయటంతో అందరిలాగే కేటీఆర్ సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది.

కనీసం సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉండేందుకు కూడా కేటీఆర్ వెనకడుగు వేస్తున్నాడంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్ధం అవుతోంది.

ఏపీలోని ఆ ముగ్గురు నేతలపై భారీగా బెట్టింగ్స్.. ఒక్కరు కూడా గెలవడం కష్టమేనా?