మెగా ఫ్యామిలీకి శ్రీజ రెండో భర్త ఎందుకు దూరంగా ఉంటున్నాడు?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్.శ్రీజకు రెండో భర్త.
వీరి పెళ్లి అయ్యాక.దేవ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు కూడా.
విజేత అనే సినిమాలో హీరోగా చేశాడు.అయితే విజేత సినిమా దేవ్ ను పరాజితుడిగా నిలిపింది.
ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ ఎంతో సపోర్టు చేసినా.అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం ఆయన మూడు సినిమాలను చేస్తున్నాడు.
ఈ సినిమాలతో తనకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడు.ఆయన సినిమా విషయాలను కాసేపు పక్కన పెడితే.
పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుందాం.మెగా ఫ్యామిలీకి దేవ్ కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
వీరి మధ్య గ్యాప్ గురించి టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.తాజాగా జరిగిన కొన్ని ఘటనలు కూడా వీటికి అద్దం పడుతున్నాయి.
శ్రీజ భర్త ఉన్న ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు.
దీంతో భార్య భర్తల మధ్య ఏదో గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు.కారణం ఏంటనేది మాత్రం ఎవరూ చెప్పట్లేదు.
కానీ.ఈ గ్యాప్ పెరగడానికి కారణం రాంచరణ్ అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ వేడుకల్లో దేవ్ ఎక్కడా కనిపించలేదు. """/" /
తాజాగా శ్రీజ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ మాత్రం తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అంతేకాదు.ఆ ఫోటోకు లవ్ సింబల్ యాడ్ చేశాడు.
దీంతో భార్య భర్తల మధ్య గ్యాప్ లేదని తేలిపోయింది.అయితే చెర్రీతో గొడవల కారణంగానే మెగా ఫ్యామిలీకి దేవ్ దూరం గా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఎంత మేరకు వాస్తవం అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాల్సిందే.ఇంతకీ చెర్రీకి, దేవ్ కు ఏ విషయంలో చెడింది అనేది తెలియాల్సి ఉంది.
మళ్లీ వీరంతా ఒక్కటి కావాలి అని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
భారతీయ విద్యకు గ్లోబల్ డిమాండ్.. ఆన్‌లైన్ స్కూల్స్‌తో కనెక్ట్ అవుతోన్న ఎన్ఆర్ఐ విద్యార్ధులు