శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఆరోజే ఎందుకు చేస్తారో తెలుసా..?

యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క క్షణం ఏదైనా ఉందంటే అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట( Lord Ram Statue ) అని చెప్పవచ్చు.

అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం చాలా మంది భక్తులు వేచి ఉన్నారు.

అయితే అందరి కలలు నెరవేరుస్తూ జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది.

అయితే జనవరి 22వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజుకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అన్న దానిపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ( Brahmasri Chilakamarthi Prabhakara Chakravarthi Sharma ) తెలిపారు.

జనవరి 22వ తేదీన అయోధ్యలో అఖిజిత్ తో కూడి ఉన్నటువంటి మేషలగ్నంలో 12 నుండి 12:30 సమయంలో ఉత్తరాయన కాలం, అలాగే విశేషించి పుష్య మాస శుక్ల పక్ష ద్వాదశి రోజు సోమవారం మృగశిర నక్షత్రంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా శుభం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

"""/" / అయితే ఈ ముహూర్త బలాల ప్రకారం లగ్నంలో గురుడు, ద్వితీయంలో చంద్రుడు, ఉచ్చ క్షేత్రంలో ఉండటం, లాభంలో శని స్వక్షేత్రంలో ఉండటం, అలాగే భాగ్యములో బుధ, శుక్ర, కుజులు అనుకూలంగా ఉండడం వలన ఇది చాలా దివ్యమైన ముహూర్తంగా చెప్పడం జరిగింది.

ఈ ముహూర్తంలో ప్రభావంచేత కొన్ని తరాలపాటు ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లుతోందని, ఈ లగ్నంలో గురుని ప్రభావం వలన భక్తులు( Devotees ) కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పంచాంగ కర్త తెలిపారు.

"""/" / అయితే అయోధ్యలో( Ayodhya ) శ్రీరాముని ఆలయ ప్రతిష్ట జరగడం, అది చూసేటువంటి భాగ్యం కలగడం ప్రస్తుత తరంలో ఉన్నవారికి కలిగిన గొప్ప అదృష్టం అని చెప్పవచ్చు.

ఇక ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని వీక్షించిన వారి జన్మ చతురతార్థం అవుతుందని చిలుకమర్తి చెప్పుకొచ్చారు.

అలాగే ఈ తరుణాన్ని అందరూ కూడా వీక్షించాలని కోరారు.అయితే భక్తుల కోసం అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్లో ఉండి మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు.

వెంకీ సీక్వెల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీను వైట్ల.. ఉన్నట్టా? లేనట్టా?