ఎందుకిలా అయ్యింది ? నేటి నుంచి జగన్ సమీక్షలు
TeluguStop.com
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో( General Election ) అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిని.
175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.
దీంతో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది.2019 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి భారీగా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ( Election Manifesto )ఇచ్చిన హామీలు దాదాపుగా అన్ని పూర్తి చేశారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా .వాటిని లెక్కచేయకుండా అప్పులు తెచ్చి మరి సంక్షేమ పథకాలను అమలు చేశారు.
"""/" /
2019 మాదిరిగానే 2024 ఎన్నికల్లోను వైసిపి విజయం సాధిస్తుందని జగన్ ధీమాగా ఉంటూ వచ్చారు.
సీనియర్ నేతలను సైతం పక్కనపెట్టి సామాజిక వర్గాల లెక్కల ప్రకారం చాలామంది కొత్త అభ్యర్థులని ఎన్నికల్లో పోటీకి దించారు.
అభ్యర్థి ఎవరనేది జనాలు పట్టించుకోరని, తనను చూసే జనాలు ఓటు వేసే పరిస్థితి ఉందని జగన్ ( Jagan )బలంగా నమ్మరు.
కానీ జనాలు మాత్రం టిడిపి ,జనసేన ,బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి వైపే ముగ్గు చూపించారు.
ఇదిలా ఉంటే అసలు ఇంత ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలు ఏమిటి అనేది ఇప్పటికీ వైసీపీ నేతలకు అంతు పట్టడం లేదు.
ముఖ్యంగా ఎన్నికల్లో పరాభవం నుంచి జగన్ ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. """/" /
ఇదెలా ఉంటే అసలు ఓటమికి గల కారణాలు ఏమిటి అనే దానిపై జగన్ తన పార్టీ అభ్యర్థులతో నేటి నుంచి సమీక్షలు చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనే దానిపైన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ఆలోచన తో ఉన్నారు.
అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాత ఒక అంచనాకు వచ్చి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు.
నియోజకవర్గాల వారీగా నేతలతో నేటి నుంచి జగన్ సమావేశం కానున్నారు.
సూర్య భయ్యా, నువ్వు సూపర్.. రహానే సెంచరీ కోసం ఇంత త్యాగమా..?