నది రజస్వల అంటే ఏమిటి? ఆ సమయంలో పుణ్య నదుల్లో స్నానం ఎందుకు చేయకూడదు తెలుసా..?

మన భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు వాటిలో ముఖ్యమైనవి పుణ్యా నది పుష్కర స్నానాలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మహర్షులా తపోశక్తి నది జలాలలో( River Water ) నిక్షిప్తమై ఉంటుందని వేదాలలో ఉంది.

కాబట్టి శాస్త్ర విధానంగా నది స్నానం( River Bath ) తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు.

పుణ్య నది తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే నది రజస్వల అంటే ఏమిటి? ఆ సమయంలో పుణ్యం నదుల్లో స్నానం చేయడం దోషం అంటారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నది స్నానం చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.

నవగ్రహాలకు నాయకుడైన రవి కర్కాటక సంక్రమణం మొదలు రెండు నెలలు నది స్నానం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు.

ఈ కాలం నదులకు రజస్వాల దోషం( Rajasvala Dosham ) ఉన్న సమయంగా శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే నదులకు రజస్వల దోషం అంటే నది లోకి కొత్త నీరు వచ్చి చేరడం అని పండితులు చెబుతున్నారు.

అయితే వరద జలాలు వచ్చి నదిలో చేరే సమయంలో నది జలలు మలినం అయిపోతాయి.

"""/" / ఈ సమయంలో నది స్నానం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా నది పోటు ఎక్కువగా ఉండే కాలంలో నదుల్లోకి వెళ్తే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది.

ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను గమనిస్తూ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు నది లో స్నానం చేయకూడదని నిషేధాన్ని విధించారు.

అంతే కాకుండా తప్పని సరిగా నది స్నానం చేయాల్సి వస్తే కొన్ని నియమాలను నిర్దేశించారు.

ఈ నియమాలను కచ్చితంగా పాటించి నది స్నానాలను చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు.

వీడియో: స్వీట్‌షాప్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. తృటిలో తప్పించుకున్న యువతి..