మన బాడీకి విటమిన్ `కె` ఎందుకు అవసరం.. ఏయే ఆహారాల్లో దొరుకుతుంది..?
TeluguStop.com
విటమిన్ కె.( Vitamin K ) మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ఒకటి.
హెల్త్ మరియు ఫిట్‌నెస్‌లో విటమిన్ కె కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్ కె ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రిస్తుంది.ఎముక పగుళ్లు మరియు తక్కువ ఎముక సాంద్రత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే రక్తం గడ్డకట్టడానికి మరియు రక్తస్రావం ఆపడానికి విటమిన్ కె చాలా అవసరం.
ఇది గాయాలను నయం చేయడంలో తోడ్పడుతుంది. """/" /
విటమిన్ కె ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
విటమిన్ కె వృద్ధులలో ఎపిసోడిక్ మెమరీని( Episodic Memory ) మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.రక్త ప్రసరణను పెంచి జుట్టు మరియు స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తుంది.
అందువల్ల డైలీ డైట్ లో విటమిన్ కె ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం.
ఇక విటమిక్ కె ఏయే ఆహారాల్లో మెండుగా దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
అరటిపండ్లు( Banana ) విటమిన్ కె కు మంచి మూలం.
అరటిపండ్లలో ఉండే విటమిన్ కె మన శరీరం సులభంగా గ్రహిస్తుంది.జీర్ణక్రియ మరియు బరువు నిర్వహణలో సహాయపడే ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా మనం అరటిపండ్ల ద్వారా పొందొచ్చు.
అలాగే విటమిన్ కె రిచ్ ఫుడ్స్ లో బ్రోకలీ( Broccoli ) ముందు వరుసలో ఉంటుంది.
బ్రోకలీ ద్వారా విటమిన్ కెతో పాటు ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం మరియు ఫైబర్ ను పొందొచ్చు.
బాదం, జీడిపప్పు లో అధిక మొత్తంలో విటమిన్ కె ఉంటుంది.వీటిని డైట్ లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి, ఎముకల బలాన్ని నిర్వహించడానికి మరియు ఆకలిని తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటాయి.
అంతేకాకుండా కోడి గుడ్లు, బ్లూ బెర్రీస్, అవకాడో, ఆకు కూరలు, జున్ను, కివి పండ్లు, క్యారెట్స్ లో కూడా విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.
రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!