వార్డెన్ల బదిలీల్లో అయోమయం దేనికి: సక్రు నాయక్

నల్లగొండ జిల్లా:జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో ఇటీవలి జరుగుతున్న వార్డెన్ల బదిలీలు అయోమయానికి గురిచేస్తున్నాయని రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్అన్నారు.

గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ల బదిలీలు మరీ గందరగోళంగా ఉన్నాయని, ఉదయం ఉత్తర్వులు రావడం, జాయిన్‌ అవ్వడానికి ముందే రద్దు కావడం,ఆ స్థానంలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వడం, ఒక వేళ జాయిన్‌ అయినా వారంలోపే మళ్లీ బదిలీ కావడం జరుగుతున్నదని, పోస్టు ఉంటుందో ఊడుతుందో తెలియక అనేకమంది ఆందోళన చెందుతున్నారన్నారు.

రాజకీయ జోక్యంతోనే ఇదంతా జరుగుతుందని,కొంతమంది అధికార పార్టీ నాయకులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అందువల్లే మాటిమాటికి బదిలీ ఉత్తర్వులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయన్నారు.

రాజకీయ జోక్యం లేకుండా ఉత్తర్వులు ఇచ్చిన వారంలోనే మళ్లీ మార్పులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు.

హాస్టల్ వార్డెన్ల ‌పోస్టింగుల్లో అధికార పార్టీ నేతలు,ఆఫీసర్లు,ఉద్యోగుల మధ్య గొడవలకు సంక్షేమ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డాగా మారిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తుందని, ఉద్యోగ సంఘాలు,ఉద్యోగులు కలిసి ఆఫీసర్లపై పెత్తనం చేస్తున్నారని,ఇందులో భాగంగానే ఇటీవల సహకార శాఖ అధికారిని ఇక్కడి నుంచి తప్పించారనే చర్చ జరుగుతుందన్నారు.

ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, వార్డెన్ల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇటీవల జిల్లా ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని, ఇందులో భాగంగానే గతంలో ఇక్కడి పనిచేసిన డీటీడీవోను ఆ పోస్టు నుంచి తప్పించి హౌజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీడీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీటీడీవోగా నియమించారని,డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్లే ఉద్యోగుల మధ్య సఖ్యత లేకుండా పోయిందన్న వార్తలు వస్తున్నాయన్నారు.

ఈ మొత్తంలో వ్యవహారంలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,చుట్టపు చూపుగా వచ్చే వార్డెన్లు మెనూ పాటించకుండా,వసతి సౌకర్యాలు పట్టించుకోకుండా ఇచ్చింది తీసుకో.

పెట్టింది తిను.అనే పద్ధతుల్లో ఉన్నారని,ఇలాంటి వార్డెన్లను, వారికి సహకరిస్తున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తక్షణమే కౌన్సిలింగ్ లో వార్డెన్లకు కేటాయించిన హాస్టళ్లకు పంపించాలని, లేకపోతే జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.

హర్‌ ఘర్‌ తిరంగ సర్టిఫికేట్‌ ను పొందారా..? లేకపోతే ఇలా చేసేయండి..