చంద్రబాబు అరెస్టుపై టీడీపీ హంగామా ఎందుకు..?: సజ్జల
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఎందుకు హంగామా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు.చంద్రబాబును హింసిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
అన్నీ పరిశీలించిన తరువాతనే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందన్నారు.దోపిడీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే మానవహక్కులకు భంగం అంటే ఎలా అని నిలదీశారు.
టీడీపీ హడావుడితో అసలు విషయం పక్కకు పోతోందని పేర్కొన్నారు.కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారని వెల్లడించారు.
కేసు నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న సజ్జల ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
కెనడా, చైనా, మెక్సికోలకు షాక్ .. సుంకాల పెంపుకు ట్రంప్ సిద్ధం?