సాయి పల్లవికి భారీ రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారంటే..?
TeluguStop.com
ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి( Sai Pallavi ) ఆ సినిమాతోనే ప్రేక్షకులందరికీ దగ్గరైంది.
ఇక ఎప్పుడైతే ఆమె ఆ సినిమాలో నటించిందో ఆమె నటనకు మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆమె సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అయితే ఏది పడితే ఆ సినిమాలను చేయకుండా తన పాత్రకి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్లు మాత్రమే పోషిస్తూ వస్తుంది.
అందుకోసమే పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఆ సినిమాల్ని వదిలేసి చిన్న సినిమాలైన సరేగాని తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె ఆ పాత్రలో నటించి మెప్పించడానికి రెడీ అవుతుంది.
"""/" /
ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆమె పెద్ద ప్రాజెక్టులను కూడా చేస్తుంది.
ఇక ప్రస్తుతం చందు మొండేటి( Chandu Mondeti ) డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో( Tandel Movie ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక దీంతోపాటుగా హిందీలో అత్యంత ప్రెస్టీజీయస్ గా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది.
ఇక రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయంలో చాలా భారీగా తీసుకుంటుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు ఆమె చాలా తక్కువ రిమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ బాలీవుడ్ సినిమా అయిన రామాయణం కోసం దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
"""/" /
మరి ఆమెకు అంత చెల్లించి ఆ సినిమాలు ఎందుకు పెట్టుకోవడం వేరే ఆల్టర్నేట్ హీరోయిన్స్ ఉన్నారు కదా అంటే సీత పాత్రకి సాయి పల్లవి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
ఎందుకంటే తను బయట ఎక్కడ చూసినా కూడా ఫంక్షన్స్ లో వల్గర్ గా కనిపించదు పద్ధతిగా డ్రెస్ వేసుకొని వస్తుంది.
అలాగే సినిమాల్లో కూడా పద్ధతిగా డ్రెస్ లను వేసుకుంటుంది అందువల్లే సీతా లాంటి పాత్రకి తను అయితేనే ప్రేక్షకులు తనని ఓన్ చేసుకోగలరనే ఉద్దేశ్యం తో ఆమె ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ అయిన సరే ఇచ్చి తనని ఆ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అధ్యక్షుడిగా ట్రంప్ .. ఈసారి భారతీయ వలసదారులకు కష్టమే : రాజా కృష్ణమూర్తి