కేసీఆర్ విమర్శలకు మోదీ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?

తెలంగాణ సీఎం కేసీఆర్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.గతంలో ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతారా.

సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్లాస్ పీకారు.

కట్ చేస్తే ఇప్పుడు ఆయనే ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ మార్పు ఎందుకోసం అని సామాన్యుడిని అడిగితే ఓట్ల కోసమే కదా అని చెప్పే పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి.

చివరకు హిందూ దేవతలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీని కేసీఆర్ తిట్టడం విమర్శలకు తావిచ్చింది.

అయితే కేసీఆర్ ఎన్ని తిట్టినా ప్రధాని మోదీ సైలెంట్‌గానే కనిపిస్తున్నారు.ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలలో హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని మోదీ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తారని అందరూ భావించారు.

కానీ అలా జరగలేదు.ఆయన నోటి వెంట కేసీఆర్ అనే పదమే రాలేదు.

దీంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే మోదీ మౌనం వెనుక వ్యూహం దాగుందని బీజేపీ నేతలు అంటున్నారు.

కేసీఆర్ విషయంలో ప్రత్యేకమైన ప్లానింగ్ తో బీజేపీ అధినాయకత్వం ఉందంటున్నారు.గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందనే మాట అయితే వాస్తవం.

అయితే ఆ గ్రాఫ్ ఎన్నికల్లో ఎంత వరకు పనికివస్తుందన్న విషయం కమలనాథుల్లో టెన్షన్ పెంచుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల కారణంతో గెలిచామని బీజేపీకి కూడా తెలుసు.కానీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే వరకు వెయిట్ చేయాలన్నదే బీజేపీ సిద్ధాంతంగా కనిపిస్తోంది.

అయితే మిగతా రాష్ట్రాల మాదిరిగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్న బీజేపీ కేసీఆర్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉంటోంది.

అలా చేస్తే కేసీఆర్ మీద సానుభూతి పెరిగే అవకాశం ఉందని.అందుకే గులాబీ బాస్ ఎన్నేసి మాటలు అంటున్నా.

చూస్తూ ఉండాలే తప్పించి తొందరపడి రియాక్టు కాకూడదన్న ఆలోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది.

"""/"/ కేసీఆర్‌పై ఒక్కసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది.

అటు ఇటీవల తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండేలు పుట్టుకువస్తారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ను బాగానే హర్ట్ చేశాయి.

అందుకే రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో కేసీఆర్ పదే పదే ఏక్‌నాథే షిండే పేరును ప్రస్తావించారు.

ఆ ఏక్‌నాథ్ షిండే ఎవరో అని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కనిపెట్టే పనిలో ఉంది.

Slot Monster: How The Platform Works And What UK Players Should Know