నాగేశ్వర రావు చివరి స్టేజ్ లో ఎందుకు తన ఫ్యామిలీ కి దూరం గా ఉన్నారు…
TeluguStop.com
ఎన్టీయార్( NTR ) తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నాగేశ్వర రావు( Nageswara Rao ) అనే చెప్పాలి.
బాలనటుడుగా కెరీర్ ప్రారంభించిన ఏఎన్నార్.ఆ తర్వాత హీరోగా మారారు.
అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకంగా 250కి పైగా చిత్రాలు చేశారు.
సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి.కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని దక్కించుకున్నారు.
దాదాపు ఏడు దశాబ్ధాల పాటు సినీ పరిశ్రమకు( Film Industry ) తన సేవలు అందించిన నాగేశ్వరరావు ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్నారు.
పేరు ప్రక్యాతలు సంపాదించుకున్నారు.ఏఎన్నార్ అంటే పేరు కాదు బ్రాండ్ అనేలా ఎదిగిన ఆయన.
91 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో కన్నుమూశారు.2014, జనవరి 22 న తుది శ్వాస విడిచి తెలుగు సినీ పరిశ్రమలోను విషాదంలోకి నెట్టేశారు.
అయితే చనిపోవడానికి కొద్ది రోజులు ముందు ఏఎన్నార్ ఎంతో క్షోభకు గురయ్యారట. """/" /
కనీసం సొంత ఫ్యామిలీని కూడా దగ్గరకు రానివ్వలేదట.
ఏఎన్నార్ ఆఖరి రోజుల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ( Cancer Treatment )కారణంగా ఆయనను ఎక్కడ ముట్టుకున్నా చర్మం ఊడివచ్చేసేదట.
ఆ సమయంలో బయట వారినే కాదు.ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా చూసేందుకు ఆయన ఇష్టపడలేదట.
ఒకవేళ ఎవరైనా తన పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటే.అధైర్యం కలుగుతుందని, అందులోనూ కుటుంబసభ్యులు బాధపడితే తాను మరింత వీక్ అయిపోతానని ఏఎన్నార్ భావించారట.
"""/" /
అందుకే చికిత్స తీసుకుంటున్న సమయంలో చాలా మంది చూడడానికి వచ్చినా.
ఏఎన్నార్ వారిని దూరం పెట్టారట.ఈ విషయాలను ఏఎన్నార్‌తో మంచి అనుబంధం ఉన్న నటుడు కాదంబరి కిరణ్( Kadambari Kiran ) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.
ఇకపోతే ఏఎన్నార్ చివరిగా నటించిన చిత్రం `మనం`.ఈ మూవీతో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భాగం అయ్యారు.
దురదృష్టం ఏంటంటే.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఎన్నార్ మృతి చెందారు.
ఆయన చనిపోయిన నాలుగు నెలలకు విడుదలైన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీలోనే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!