Naga Chaitanya : ఎన్టీయార్ రామ్ చరణ్ లా మాదిరి నాగ చైతన్య ఎందుకు స్టార్ హీరో అవ్వలేకపోతున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక అందులో భాగంగానే చాలామంది నటులు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఒక దానికి మించి మరొక పాత్ర చేస్తూ చాలా అవార్డులను కూడా అందుకుంటుంటారు.

ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమంది నటులు మాత్రం వాళ్లకు వచ్చిన ఆఫర్లను వద్దనకుండా క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా రాణించాలి అంటే మాత్రం చాలా కష్టమైన పని అనే చెప్పాలి.

"""/" / ఎందుకంటే ఇక్కడ బాగా చేసినా కూడా సక్సెస్ ఉంటేనే హీరోకి గుర్తింపు అనేది ఉంటుంది.

అందువల్లే అక్కినేని మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) కెరియర్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినప్పటికీ తనకి సక్సెస్ లు అనేవి ఎక్కువగా లేకపోవడంతో ఆయన మీడియం రేంజ్ హీరో గానే గుర్తించబడ్డాడు.

తనతో పాటు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటులు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందుతూ గ్లోబల్ స్టార్లుగ వెలుగొందు తుంటే నాగచైతన్య మాత్రం ఇంకా సెకండ్ గ్రేట్ హీరో గానే గుర్తింపు పొందుతున్నాడు.

"""/" / మరి ఈయన స్టార్ హీరోగా మారాలి అంటే మాత్రం చాలా కసరతులు చేయాల్సిన అవసరమైతే ఉంది.

ఇక తన సహనటి అయిన సమంతని ( Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకోవడం కూడా ఆయన కెరియర్ కి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి.

అందువల్లే ఆయన కొద్దిపాటి డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని సినిమా చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలని అని ప్రయత్నం చేస్తున్నాడు.

పెళ్లి తర్వాత హ్యాపీగా లేము… ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అమర్ తేజు… ఆ వార్తలను నిజం చేస్తారా?