మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…

సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు(Mohan Babu) ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.

అయితే కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన రీతిలో నటిస్తూ మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన కొంత వరకు ఇబ్బందుల్లో పడ్డారు.ఇక తన కొడుకులతో విభేదాలను పెట్టుకున్న మోహన్ బాబు(Mohan Babu) పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లడం అనేది ఆయన ఇమేజ్ కు కొంతవరకు డామేజ్ కలిగించే విషయమనే చెప్పాలి.

అయితే ఈ విషయంలో మనోజ్(Manoj) తప్పు చేస్తున్నాడా మోహన్ బాబు తప్పు చేస్తున్నాడా అనే విషయాలైతే ఇంకా సరిగ్గా తెలియదు కానీ వీళ్ళిద్దరూ ఎంతో కొంత తప్పు చేయడం వల్ల వీళ్ళ ఇమేజ్ బజారుకు పడుతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో ఘన కీర్తిని సంపాదించుకున్నాడు.

ఇక ఈ రోజున ఆయన సంపాదించుకున్న ఇమేజ్ అంత పోతుంది.ఇక తన కొడుకులు అయినా విష్ణు,మనోజ్(Vishnu, Manoj) లను చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణగా పెంచినప్పటికి ఇప్పుడు మోహన్ బాబు అనుకరిస్తున్న వైఖరి వల్లే వాళ్ళు తనకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమైతే వస్తుందని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి (Mohan Babu's Family)ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది.

మరి ఈ ప్రాబ్లం నుంచి వాళ్లకి వాళ్లు కాంప్రమైజ్ అవుతారా లేదంటే ఎవరైనా కాంప్రమైజ్ చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక వీళ్లలో మోహన్ బాబు ఇప్పుడు సినిమాలు ఏమి చేయడం లేదు.విష్ణు (Vishnu)మాత్రం కన్నప్ప(Kannappa) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

సైబర్ అలర్ట్: అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త సుమీ..