శబరిమలలో మకరవిళక్కు ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుకున్న పురాణ గాధ ఏంటో తెలుసా..

మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న లక్షలాది మంది అయ్యప్ప స్వాముల కు మకర జ్యోతి కనువిందు చేసింది.

ఆ సమయంలో లక్షలాది మంది అయ్యప్ప స్వాములు నినాదాలతో శబరి గిరులు మారి మార్మోగిపోయాయి.

స్వామియే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప ఇది భక్తజనులు మకర జ్యోతి రోజున శబరిమలపై చేసే శరణు ఘోష.

ఇంతకీ శబరిమలలో మకర విళక్కు ఎందుకు చేసుకుంటారు.దీని వెనుక ఉన్న పురాణ గాధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రామలక్ష్మణులు శబరిమలలో భక్త శబరిని కలుసుకున్నప్పుడు ఆమె పెట్టే పండ్లను రుచి చూస్తారు.

"""/"/ అక్కడ తపస్సు చేస్తున్న ఒక దివ్య శక్తిని శ్రీరాముల వారు చూస్తారు.

అప్పుడు అతడు ఎవరని శబరిని అడుగుతారు.అతడు శాస్త్రగా భక్త శబరి చెబుతుంది.

అంతలో రాముడు శాస్త్రవైపు నడుస్తున్నప్పుడు శాస్త్ర రామునికి స్వాగతం పలికేందుకు లేచి నిలబడతాడు.

ఈ అపురూప సన్నివేశానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని ఆ రోజున జరుపుకుంటారు.మకర విళక్కు రోజున ధర్మశాస్త్ర భక్తులను ఆశీర్వదించడానికి తన తపస్సుకు విరామం తీసుకున్నాడని స్వామి భక్తులు నమ్ముతారు.

"""/"/ స్వామి దీక్ష విరమించి ఎంతో విశ్రాంతిగా ఉన్న సమయంలో తన మొర ఆలకిస్తాడని తమను కాపాడమంటూ భక్తులు చేసే శరణు ఘోష విని పేరు పేరునా వారి కోరికలను నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం.

అయ్యప్ప అనగానే చూసి తీరాల్సిన మహా మహోత్సవం మకర జ్యోతి దర్శనమే అని అయ్యప్ప స్వామి భక్తులు చెబుతూ ఉంటారు.

ఈ దర్శనం శబరిమల పై చేసుకోలేని వారు ఇక్కడే తమ ఇళ్లలో 18 మెట్లకు గుర్తుగా 18 దీపాలను వెలిగించి జ్యోతి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

వైసీపీ నేత అంబటి రాంబాబు పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..!!