సినిమా చూపించబోతూ ట్రైలర్ ఎందుకు లోకేష్..?
TeluguStop.com
సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్ రిలీజ్ చేసినట్లు నారా లోకేష్ బాబు ఏదో బయటపెడతానని చెప్పడం ఎందుకు బయటపెడితే పోలా.
అంటున్నారు విశ్లేషకులు.సినిమాల్లో ఐతే హైప్ రావడానికి టీజర్.
ఫస్ట్ లుక్.ట్రైలర్ ఇలా బోలెడన్ని ప్రకటిస్తారు.
మరి రాజకీయాల్లో అలా సాధ్యమా.ఇలా హింట్స్ ఇచ్చుకుంటే పోతే ప్రత్యర్థులు పక్కా ప్లాన్ చేసుకోరా.
చెప్పేదేదో నేరుగా చెప్పక ఈ సినిమా స్టంట్స్ ఏంటి.? లోకేష్ అంటున్నారు.
ఒకవేళ అనుకున్నది జరగకపోతే.రిటన్ గా జరిగే నష్టం మామూలుగా ఉండదంటున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెట్టబోతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే అదేంటన్నది మాత్రం రివిల్ చేయలేదు.దీంతో వచ్చే వారం లోకేశ్ బయటపెట్టే భారీ స్కాం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది.
?
ప్రత్యర్థులు ప్రిపేర్ అయ్యే దానికి అవకాశం ఇచ్చేలా లోకేశ్ మాటలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
నేరుగా వారం తర్వాతే చెప్తే బాగుంటుండే కదా.ఇప్పుడు అది వర్కౌట్ కాకపోతే పరిస్థితి ఏంటని అంటున్నారు.
మంగళగిరిలో లోకేశ్ తన సొంత ఖర్చులతో ఆరోగ్య సంజీవని కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ.పదో తరగతి పాస్.
డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి అంటూ ఎద్దేవా చేశారు.జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల కంటే కూడా ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలే ఎక్కువన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతన్న చర్చే జరుగుతుందన్నారు.గడిచిన మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు.
జగన్ రెడ్డికి టైమప్ అయిపోయి ఇంటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.ఎన్నికల సందర్భంగా దాదాపు 500 హామీల్లో మాట తప్పి.
మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గ వర్గాల్లో గెలిపించాలా.? అని ప్రశ్నించారు.
"""/"/
లోకేష్ బాబు మాట్లాడిందంతా బాగానే ఉన్నా.వచ్చే వారం లోకేశ్ బయటపెట్టనున్న భారీ స్కాం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే భారీ స్కాం అన్నాడు కాబట్టి అదేదో అప్పుడే చెప్తే ప్రత్యర్థులు ఇరుకున పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుండే.
అదే ఇప్పుడు వారం లోగా అంటే ఆ లోపు ఏమైనా జరిగే అవకాశాలు లేకపోలేదు.
ఎలాగూ వారం టైమ్ ఇచ్చారు కాబట్టి.ఏం బయటపెట్టిన కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారని అంటున్నారు.
ఏది నీది కానప్పుడు భయం ఎందుకు… సంచలనంగా మారిన మంచు లక్ష్మీ పోస్ట్!