విలేకరుల సమావేశానికి కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు?

ఇటీవల కాలంలో కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతు చిక్కడం లేదు.  తాజాగా తన ఎమ్మెల్యేలను బీజేపీమభ్య పెట్టడానికి ప్రయత్నిస్తుందనే ఆరోపణలు చేసిన కేసీఆర్ మీడియాతో ఎందుకు మాట్లాడడం లేదనేది చాలా మందిని ఆశ్ఛర్యపరుస్తుంది.

 ఈ అంశంపై కేసీఆర్ మీడియాతో మాట్లాడతారని ఆయన కార్యాలయం రెండు రోజుల క్రితం ప్రకటించింది.

 అయితే ప్రకటన వెలువడి రెండు రోజులు గడిచినా ఇంతవరకు ప్రెస్ మీట్ జరగలేదు.

 అంతుచిక్కని వ్యూహాకర్తగా కేసీఆర్ పేరుంది. నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కొనుగోలు చేయలని భావించదని తెలిసి వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి భాజాపాను చేడుగుడు ఆడుకుంటారని అందరి భావించారు.

 కానీ కేసు విచరణలో ఉంది కాబట్టి ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

  జాతీయ మీడియాను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారని, జాతీయ స్థాయిలో కవరేజ్ వచ్చేలా మాట్లాడతారని చెప్పారు.

 కానీ, అది కూడా జరగలేదు.తొలుత గురువారం ప్రెస్‌మీట్‌ జరగాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా పడింది.

 కానీ, కేసీఆర్ మాత్రం తన ప్రగతి భవన్‌లో సన్నిహితులతో మెదులుతూనే ఉన్నారు. ఈ మొత్తం అంశంపై కేటీఆర్ సహా మరికొందరు మాట్లాడినప్పటికీ కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు.

"""/"/ ఈ అంశం ఆశించిన స్థాయిలో సంచలనం సృష్టించకపోవడంతో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టకూడదని, దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

 ఈ అంశం రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ ఊహించినంత సంచలనం సృష్టించలేదు. అందుకే మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

 మీడియాతో మాట్లాడేందుకు సరైన సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

క‌ల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!