Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకు..?: కిషన్ రెడ్డి
TeluguStop.com

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నివాసంలో ఈడీ మరియు ఐటీ అధికారుల దాడులపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్పందించారు.


నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఈడీ అధికారుల విచారణకు కవిత సహకరించాలని సూచించారు.


ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకున్నారని ఆరోపించారు.కవిత సహకరించకపోవడంతోనే ఈడీ అధికారులే ఆమె నివాసానికి వచ్చారని తెలిపారు.
కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి( BJP ) లేదన్నారు.విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని స్పష్టం చేశారు.