BJP : ఏపీ బీజేపీ : ఎందుకింత గందరగోళం ? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండయ్యా
TeluguStop.com
ఏపీలో బిజెపి ( BJP )పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది.
ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతమందిని మార్చినా, అదే పరిస్థితి.చేరికలు లేకపోగా, ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టిడిపి , జనసేనతో కలిసి వెళ్తున్నారా లేక ఒంటరిగా వెళ్తున్నారా అనే విషయం లో గత కొంతకాలంగా ఏ క్లారిటీ ఇవ్వకుండా జనాలతో పాటు, పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురిచేస్తున్నారు.
ఇప్పటికే టిడిపి, జనసేన ( TDP, Jana Sena )లు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, వైసిపి ఎనిమిది విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.
కానీ బిజెపి మాత్రం పొత్తుల విషయంలో ఇంకా నాన్చి వేత ధోరణిని అవలంబిస్తూ ఉండడంతో ,అసలు టిడిపి జనసేన కూటమిలో బిజెపి చేరుతుందా లేక ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందా అనే విషయంలో బిజెపి రాష్ట్ర నాయకులకు కూడా ఏ క్లారిటీ దొరకడం లేదు.
దీంతో అనేక రాజకీయ సమావేశాల్లో ఈ విషయంపై ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏపీ బీజేపీ నాయకుల్లో నెలకొంది.
"""/" /
ఏపీలో టిడిపి , జనసేన కూటమితో కలిసి వెళ్లే విషయంలో పార్టీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కొంతమంది పొత్తును సమర్థిస్తూ ఉండగా, మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.దీంతో బిజెపి అధిష్టానం కూడా ఆచితూచి దీనిపై నిర్ణయం తీసుకునేందుకు చూస్తోంది.
మరోవైపు చూస్తే పొత్తులతో సంబంధం లేకుండా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడమే లక్ష్యంగా అన్నట్లుగా సమావేశాలు ఏపీలో నిర్వహిస్తోంది .
ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggupati Purandareshwari ) అధ్యక్షతన విజయవాడ వేదికగా తొలి రోజు 14 జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది.
ఈరోజు మిగిలిన జిల్లాల నాయకులతో సమావేశం ఉంటుంది. """/" /
ఈ సమావేశాల్లో పార్లమెంట్ , అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ చేయనున్నారు.
ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ బీజేపీ నాయకత్వంతో పాటు, జాతీయ నేతలంతా కలిసి ఈ వడబోతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మొదటి రోజు సమావేశంలో పాల్గొన్న కొంతమంది బిజెపి నేతలు పొత్తు అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు .
పొత్తులు విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకుండా అధిష్టానం కన్ఫ్యూజ్ చేస్తోందని ఆవేదన చెందారు.
పొత్తు అంశంపై అన్ని జిల్లాలు ఇన్చార్జిలు, ముఖ్య నేతలు అభిప్రాయాలను స్వీకరిస్తామని బిజెపి మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ( Rajya Sabha Member CM Ramesh ) అన్నారు.
పొత్తు ఉంటే పరిస్థితి ఏంటి లేకపోతే ఎలా ఉంటుంది అనే అంశాల పైన చర్చించారు.
పొత్తుల విషయంలో తాము ఏ విధంగా ముందుకు వెళుతున్నాం అనే విషయంలో బిజెపి రాష్ట్ర నాయకులకు సైతం కనీసం అధిష్టానం ఎటువంటి లీకులు ఇవ్వకపోవడంతో, పార్టీ కేడర్ కు ఈ విషయంలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉన్నారు.
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్… ఎమోషనల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్…