నాగార్జున చేతిలో మోసపోయిన తమిళ్ టాప్ డైరెక్టర్…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు వాళ్ల స్థాయి ని నిరూపించుకోవడానికి వరుసగా సినిమాలు చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే మరి కొందరు మాత్రం బిలో అవరేజ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు ని అయితే తెచ్చుకుంటున్నారు.

ఇక ఇప్పుడు నాగార్జున( Nagarjuna ) హీరోగా తన వందో సినిమాకు సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి.

నాగార్జున ఇప్పటికి రెండు మూడు సంవత్సరాల నుంచి తమిళ్ డైరెక్టర్ అయిన మోహన్ రాజాతో( Mohan Raja ) సినిమా చేయాలని చూస్తూ ఆయనతో స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించాడు """/" / ఆ సినిమా మీద అంత సంతృప్తిగా లేని నాగార్జున మోహన్ రాజా ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరో తమిళ్ డైరెక్టర్ తో( Tamil Director ) తన వందో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే మోహన్ రాజా తెలుగులో రీసెంట్ గా చిరంజీవి తో గాడ్ ఫాదర్( God Father ) లాంటి సినిమా తీసి ప్లాప్ ని మూట కట్టుకున్నాడు.

దాంతో నాగార్జున ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు .దాంతో మోహన్ రాజా కూడా నాగార్జున కోసం వెయిట్ చేయకుండా తమిళం లో తని ఒరవన్ 2 సినిమాని జయం రవి ని హీరోగా పెట్టి చేస్తున్నాడు.

"""/" / ఇక ఈ క్రమంలోనే నవీన్ అనే ఒక తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ డైరెక్టర్ పెద్దగా ఎవరికీ తెలీదు.ఈయన అప్పుడెప్పుడో ఒక సినిమా తీసి అవరేజ్ హిట్ ని మాత్రమే అందుకున్నాడు అయినప్పటికీ ఆయన చెప్పిన కథ నచ్చిన నాగార్జున తన 100 సినిమాకి డైరెక్టర్ గా అతన్ని ఎంచుకున్నట్టు గా తెలుస్తుంది.

నిజానికి నాగార్జున ఇంతకు ముందు కూడా చాలా మంది డైరక్టర్ల తో సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?