వేరే వారి పెళ్లి వల్ల నటుడు గిరిబాబుకి నరకం.. ఎందుకో తెలుసా..??

హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు( Giribabu ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు.సినిమాల కోసమే తన పేరును షార్ట్ గా మార్చుకున్నాడు.

1973లో ‘జగమేమాయ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ నటుడు ‘దేవతలారా దీవించండి’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు.

కొద్ది రోజులకు డైరెక్టర్‌గా కూడా అవతరించాడు.నిర్మాత, దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా బాగా పేరు తెచ్చుకున్నాడు.

కెరీర్‌ పరంగా ఎలాంటి కష్టాలను గిరిబాబు పడలేదు కానీ వ్యక్తిగతంగా ఓ విషయంలో బాగా సఫర్ అయ్యాడు.

అదేంటో తెలుసుకుందాం.రాజమండ్రిలో ఓ థియేటర్‌ను బండారు గిరిబాబు( Bandaru Giribabu ) అనే వ్యక్తి నడిపేవాడు.

ఆయన ఒక సమయంలో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.రంగనాథ్‌ను హీరోగా పెట్టి ‘చందన’( Chandana ) టైటిల్ తో ఓ మూవీని డైరెక్ట్ చేశాడు.

దానికి ఆయనే నిర్మాతగా పనిచేశారు.ఇందులో హీరోయిన్‌గా జయంతి నటించి మెప్పించింది.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్ బండారు గిరిబాబు, జయంతిల మధ్య ప్రేమ చిగురించి చివరికి పెళ్ళికి దారితీసింది.

వీరిద్దరూ పెళ్లి చేసుకోకముందు గిరిబాబుకు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు.జయంతి( Jayanthi ) కూడా గిరిబాబును చేసుకోకముందు పేకేటి శివరాంను పెళ్లాడింది.

వీరిద్దరూ వారివారి జీవిత భాగస్వాములతో కలిసి జీవించలేక విడిపోయారు.తర్వాత వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు.

"""/" / అప్పట్లో గిరిబాబు, జయంతిల పెళ్లి తెలుగు వారి అందరికీ తెలిసింది.

అయితే ఈ బండారు గిరిబాబు ఎవరో చాలామందికి ఐడియా లేదు.ఆ కారణంగా జయంతిని పెళ్లి చేసుకుంది నటుడు గిరిబాబు అని అనుకున్నారు.

ఇండస్ట్రీ వర్గాలకు ప్రొడ్యూసర్ బండారు గిరిబాబు, నటుడు గిరిబాబు వేరువేరు వ్యక్తులు అనే సంగతి తెలుసు.

కానీ, బయట వారికి ఆ విషయం తెలియక నటుడు గిరిబాబు, జయంతి వివాహం చేసుకున్నారని అనుకున్నారు.

ప్రొడ్యూసర్ గిరిబాబు జయంతిల పెళ్లి అయ్యాక ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు ఎదురు కాకపోయినా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నటుడు గిరిబాబుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

"""/" / అందరూ కూడా జయంతిని రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నటుడు గిరిబాబును అడిగేవారు.

ఆమెను పెళ్లి చేసుకుంది నేను కాదు, బండారు గిరిబాబు అనే వేరే వ్యక్తి అని ఆయన ఎంత వివరంగా చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు.

రెండో పెళ్లి( Second Marriage ) చేసుకున్నా పర్లేదు అంటూ కొంతమంది గిరిబాబును ఓదార్చే ప్రయత్నం కూడా చేసేవారు.

"అరె బాబు అది నేను కాదురా" అని ఎంత చెప్పినా ఆయన మాటలు నమ్మకుండా ఇబ్బంది పెట్టేవారు.

ఊర్లో ప్రజలు కూడా ఆయనను ఈ ప్రశ్న అడిగి నరకం చూపించేవారు.ఆ విధంగా వేరే వారి పెళ్లి ఇతనికి పెద్ద తలనొప్పి అయి కూర్చుంది.