టీడీపీకి రాజీనామా చేసేంత కోపం గిరిబాబుకు ఎందుకు వచ్చిందో తెలుసా?

ఎన్టీఆర్.ప్రఖ్యాత సినీ నటుడిగానే కాకుండా.

విలక్షణ రాజకీయవేత్తగా గుర్తింపు పొందాడు.పార్టీని స్థాపించిన నెలల వ్యవధిలోనే పార్టీని విజయవంతంగా నడిపించి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.1982లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు ఆయనతో కలిసి నడిచారు.

పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు.వారిలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు గిరిబాబు కూడా ఉన్నాడు.

ఎన్టీఆర్ పైన తనకున్న అభిమానంతో పాటు తెలుగు ప్రజలకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో టీడీపీలో చేరాడు.

కానీ ఎన్టీఆర్.ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగానే సడెన్ గా ఓ రోజు పార్టీకి రాజీనామా చేశాడు.

వెంటనే బీజేపీలో చేరాడు.ఆయన ఎందుకు టీడీపీకి రాజీనామా చేశాడు అనేది బయటకు తెలియదు.

పార్టీ నేతలకు తెలిసినా జనాలకు అర్థం కాలేదు.అందుకే ఆయనపై పలువురు విమర్శలు చేశారు.

తాజాగా తన రాజీనామా వెనుకున్న కారణాలను వెల్లడించాడు గిరిబాబు.తను ఇంతకూ ఎందుకు అలా చేశాడు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

గిరిబాబు ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించాడు.అప్పట్లో తమ ఊరితో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇంటర్ చదువుకోవాలంటే ఒంగోలు లేదంటే చీరాలకు వెళ్లేది.

అబ్బాయిలు ఎలాగోలా వెళ్లేవారు.అమ్మాయిలు వెళ్లాలంటేనే చాలా ఇబ్బంది పడేవారు.

అందుకే రావినూతలలో ఓ జూనియర్ కాలేజీ పెట్టించేందుకు గిరిబాబు ప్రయత్నించాడు.కాలేజీ ఏర్పాటు కోసం తన పొలంలోని ఒక ఎకరా భూమిని విరాళంగా ఇవ్వడానికి తయారయ్యాడు.

"""/"/ కాలేజీ నిర్మాణం కోసం కొంత ఫండ్ ను కూడా ఏర్పాటు చేశాడు.

అక్కడ కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టూ ఉన్న 24 గ్రామాలకు మేలు జరుగుతుందిని ప్రభుత్వానికి చెప్పాడు.

గిరిబాబు కోరికను ఎన్టీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు.కాలేజీ ఏర్పాటుకు ఓకే చెప్పలేదు.

అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఇంద్రారెడ్డికి గిరిబాబు ఓ వినతిపత్రం కూడా ఇచ్చాడు.

గిరిబాబు ప్రపోజల్ కు ఆయన కూడా సరే అన్నాడు.కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ.

కాలేజీకి అనుమతి రాలేదు.సర్కారు తీరు పట్ల గిరిబాబు చాలా బాధపడ్డాడు.

అయినా.కాలేజీ ఇవ్వాలని పదే పదే కోరాడు.

అయినా ఫలితం దక్కలేదు.దాంతో టీడీపీకి గుడ్ బై చెప్పాడు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ?