ఫస్ట్ క్లాస్ ఏసీ ధరలు ఫ్లైట్ టికెట్‌తో సమానంగా ఎందుకు ఉంటాయి..?

ట్రైన్‌లో ప్రయాణం చేసేటప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.వేరే ప్రయాణాలతో పోలిస్తే ట్రైన్ జర్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లు ఈ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.అయితే ఫస్ట్ క్లాస్ టికెట్ ఖరీదు చాలా ఎక్కువ.

అంత ధర ఎందుకు అనే డౌట్ ప్యాసింజర్లకు కలగడం ఖాయం.నిజానికి ఫస్ట్ క్లాస్‌ ఏసీ కంపార్ట్‌మెంట్లలో చాలా సౌకర్యాలు ఆఫర్ చేస్తారు.

వాటికి తగినట్లే రేట్లు ఉన్నాయి.ఆ ఫెసిలిటీస్ ఏవో చూద్దాం.

భారతదేశంలో కొన్ని నిర్దిష్ట రైళ్లలో మాత్రమే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

ఈ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు చాలా సౌకర్యాలు లభిస్తాయి.దూర ప్రయాణాలు చేయడానికి రైలులో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందులోనూ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే మరింత ఎంజాయ్‌బుల్‌గా ఉంటుంది.అయితే, రైలులో చాలా రకాల ఏసీ కోచ్‌లు ఉన్నా, ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ధర అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది.

నిజానికి ఈ టికెట్ ధర ఫ్లైట్ టికెట్ ధరకు సమానంగా ఉంటుంది.ఇక ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాం.

H3 Class=subheader-style• సీటింగ్ అరేంజ్‌మెంట్ /h3p( Seating Arrangement ) ట్రైన్‌లోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోని సీట్ల అరేంజ్‌మెంట్ మిగతా కంపార్ట్‌మెంట్ల కంటే భిన్నంగా ఉంటుంది.

ఇక్కడ ఇద్దరు లేదా నలుగురికి కూర్చోవడానికి వసతి ఉంటుంది.దీన్ని కూపే అంటారు.

రైలు టికెట్‌లో సీట్ నంబర్లు ముందుగానే ఇవ్వరు.ముందుగా VIP వ్యక్తులకు ఈ కూపేల్లో సీట్లు ఇస్తారు.

తర్వాత మిగతా వారికి ఇస్తారు.ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లలోని బెర్తులు రెండవ, మూడవ ఏసీ కంపార్ట్‌మెంట్ల కంటే సాఫ్ట్‌గా, వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంటాయి.

వీటిపై కూర్చోవడం లేదా పడుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది.h3 Class=subheader-style• ప్రైవసీ/h3p( Privacy ) ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ ప్రైవసీ ఉంటుంది.

ఇక్కడ కొన్ని బెర్తులతో కూడిన క్లోజ్డ్‌ రూమ్స్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.అంటే ఒక కుటుంబం లేదా జంట ప్రయాణిస్తే, భద్రత, ప్రైవసీకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లు చాలా బాగుంటాయి.

ఇది ఒక గదిలా ఉంటుంది.ఫస్ట్ ఏసీ కంపార్ట్‌మెంట్లకు బయట స్లైడింగ్ తలుపులు ఉంటాయి.

వాటిని లోపలి నుంచి మనమే మూసుకోవచ్చు.ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లను చాలా శుభ్రంగా ఉంచుతారు.

సీటు నుంచి వాష్‌రూమ్‌ల వరకు అన్ని చోట్ల ఇతర కోచ్‌ల కంటే చాలా శుభ్రంగా ఉంటుంది.

"""/" / H3 Class=subheader-style• ఫుడ్ ఇన్‌క్లూడెడ్ /h3p( Food Included ) ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ టికెట్‌లో ఫుడ్, డ్రింక్స్ ఖర్చు ముందే చేర్చబడి ఉంటుంది.

అందుకే ప్రయాణం మొత్తం మీకు ఉచితంగా ఆహారం, పానీయాలు అందుతాయి.ఇక్కడ చాలా రకాల ఆహారం ఉంటుంది.

ఇది ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది.ఉదయం టీ-కాఫీ, బిస్కెట్ల నుంచి పకోడీలు, సాండ్‌విచ్‌లు వరకు వాటి ఫుడ్ మెనూలో ఉంటాయి.

అంతే కాదు, బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌లో కూడా చాలా టేస్టీ ఫుడ్ ఎంచుకోవచ్చు.అంతే కాకుండా, భోజనం, డిన్నర్ కూడా ఇందులో ఉన్నాయి.

విందు తర్వాత, ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులకు డెజర్ట్ కూడా ఏర్పాటు చేస్తారు.

మీకు నచ్చిన ఏదైనా డెజర్ట్, ఐస్ క్రీమ్‌ నుంచి గులాబ్ జామున్ వరకు, ఎంచుకోవచ్చు.

ప్రయాణం సమయంలో మంచి ఫుడ్, డ్రింక్స్ దొరికితే, ఆ జర్నీ గుర్తుండిపోతుంది. """/" / H3 Class=subheader-style* పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు /h3p పెంపుడు కుక్క లేదా పిల్లిని తీసుకెళ్లాలనుకుంటే, ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లవచ్చు.

కానీ ప్రయాణం సమయంలో ఇతర ప్రయాణికుల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.పెంపుడు చిన్నది అయితే, బుట్టలో తీసుకెళ్లవచ్చు.

కన్నబిడ్డలను దత్తతకు ఇచ్చిన యూఎస్ మహిళ.. కారణం తెలిస్తే షాకే..