అనుష్కలో ప్రత్యేక ఆకర్షణ.. అందుకే అందరూ ఆమెను గౌరవిస్తారు..?
TeluguStop.com
మూవీ ఇండస్ట్రీలో ఆడవాళ్లని ఒక ఆట బొమ్మలాగా చూస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మనస్ఫూర్తిగా వారికి గౌరవం ఇచ్చే సినీ సెలబ్రిటీస్ ఎవరూ ఉండరు.బాలకృష్ణ, కమెడియన్ అలీ, చలపతిరావు, చిరంజీవి అల్లు అర్జున్ లాంటి వారు కూడా హీరోయిన్ల గురించి చీప్ కామెంట్లు చేశారు.
దీన్ని బట్టి వారిని సినిమా ఇండస్ట్రీలో ఎలా చూస్తారో ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది.
అయితే కొంతమంది హీరోయిన్లను మాత్రం ఎవరూ కూడా పల్లెత్తి మాట అనలేరు.వాళ్లు ఈ సినీ వాతావరణానికి పూర్తి భిన్నంగా చాలా గౌరవాన్ని, ప్రేమను, అభిమానాన్ని పొందుతారు.
మనస్ఫూర్తిగా వారిపై ఇతర సినీ సెలబ్రిటీస్ ప్రేమ కురిపిస్తారు.అలాంటివారిలో సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి వారు మాత్రమే కాదు అనుష్క శెట్టి( Anushka Shetty ) కూడా ఉంది.
"""/" /
తెలుగు ఇండియన్ ఐడల్ షో రీసెంట్ ఎపిసోడ్‌లో థమన్( Thaman ) అనుష్క శెట్టిది ఎంత మంచి మనసులో తెలిపాడు.
ఓ ఐఫోన్ చూపిస్తూ, ఇది అనుష్కనే తనకు బహుమతిగా పంపించిందని తెలిపాడు.ఐఫోన్( IPhone ) కొత్త సిరీస్ రిలీజ్ అయిన ప్రతిసారీ కొత్త ఐఫోన్ తనకు సెండ్ చేస్తుందని అతను వెల్లడించాడు.
భాగమతి సినిమా( Bhaagamathi Movie ) సమయంలో తాము ఇద్దరము కలిసి పనిచేశామని, ఆ సమయంలో అనుష్క తనకు ఒక మాట ఇచ్చిందని, ఆ మాట ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ ఎడిషన్ తనకు గిఫ్ట్‌గా అందిస్తూ ఉందని తెలిపాడు.
"""/" /
యాక్టింగ్, మెరిట్, సినిమా, సక్సెస్, పాత్రలు లాంటివి అన్ని పక్కన పెడితే వ్యక్తిత్వంగా అనుష్క చాలా మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
అనుష్క కనబడితే తాను, రవితేజ కలిసి కాళ్ళు మొక్కుతామని థమన్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు.
ఒక నటిని ఇంత బాగా ప్రశంసించడం బహుశా ఇదే తొలిసారి ఏమో.ఆమె బ్యూటీని థమన్ పొగడలేదు.
ఆమె మంచితనాన్ని మాత్రమే పొగిడారు.ఆమెను బాగా గౌరవించాడు.
అందరి మెప్పు, గౌరవం పొందేలా ఆమెలో ఏదో ప్రత్యేక ఆకర్షణ ఉందని అతని మాటల ద్వారా తెలిసింది.
"""/" /
అనుష్కతో ఇప్పటిదాకా అందరూ చాలా గౌరవంగా వ్యవహరించారు.ఆమె గురించి ఇప్పటిదాకా ఎలాంటి నెగటివ్ వార్తలు రాలేదు.
అనుష్క ఇప్పుడు దాకా దర్శకుడు, నిర్మాత, హీరో ఇలా ఎవరితోనూ గొడవ పెట్టుకున్నట్లుగా రూమర్స్ కూడా రాలేదు.
కాంట్రవర్షలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది.సైజు జీరో సినిమాలోని( Size Zero Movie ) పాత్ర కారణంగా ఆమె బరువెక్కింది.
ఆ తర్వాత బరువు తగ్గలేక అవకాశాలు బాగా సన్నగిల్లిపోయాయి.కొన్ని నెలల క్రితం ఈ ముద్దుగుమ్మ నవీన్ పొలిశెట్టితో కలిసి "మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి"( Miss Shetty Mr Polishetty ) సినిమా తీసి ఒక హిట్ అందుకుంది.
ఇప్పుడు ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది.అలాగే భాగమతి సీక్వెల్ కూడా చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించారు కానీ ఆమెను గతంలో లాగా ఒక అరుంధతి, ఒక దేవసేన, ఒక రాణి రుద్రమ్మలా మళ్లీ చూడగలమా అదే ప్రశ్నార్ధకం.
CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?