ధృతరాష్ట్రుడు కళ్లు లేకుండా పుట్టడానికి కారణం ఏమిటి?
TeluguStop.com

కౌరవుల తండ్రి అయిన ధృత రాష్ట్రుడు. ఆయన భార్య గాంధారి ఎప్పుడూ కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు.


అలా ఎందుకు కట్టుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ధృత రాష్ట్రుడు పట్టుకతోనే గుడ్డి వాడు.


కానీ అతను ఎందుకలా అంధుడిగా జన్మించాడో మాత్రం చాలా మందికి తెలియదు. అయితే అతను అలా ఎందుకు పుట్టాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధృత రాష్ట్రుడికి తండ్రి పేరు విచిత్ర వీర్యుడు. ఆయనకు అంబిక, అంబాలికి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు.
అయితే వారికి సంతానం కల్గక ముందే విచిత్ర వీర్యుడు చనిపోతాడు. అయితే ఆయన తల్లి అయిన సత్యవతి ఎలాగైనా తన వంశం నిలబడాలని అందు కోసం ఏదైనా చేయాలనుకుంది.
వెంటనే తన పెద్ద కొడుకైన వ్యాసుడిని రమ్మని కోరింది. నువ్వే మన వంశం నిలబెట్టాలని కోరుతుంది.
కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోనని. కావాలంటే తన యోగ శక్తితో సోదరుడి భార్యలకు సంతానం కల్గిస్తానని చెప్తాడు.
అందుకు సంతోషించిన సత్యవతి. తన రెండో కుమారుడైన విచిత్ర వీర్యుడి భార్యలను రమ్మని కబురు పంపుతుంది.
అయితే. మొదటి భార్య అంబికను వ్యాసుడు చూడబోతుండగా.
ఆయన తేజాన్ని చూసి తట్టుకోలేక కళ్లు మూసుకుంటుంది. ఈ సమయంలోనే వ్యాస మహర్షి ఆమెకు సంతాన యోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
కానీ ఆమె కళ్లు మూసుకుని ఉన్నందున ఆమెకు గుడ్డి వాడైన ధృత రాష్ట్రుడు పుడతాడు.
ఇలా పుట్టుకతోనే కౌరవుల తండ్రి అంధుడయ్యాడు.