ఛీ.. ఛీ.. మరీ ఇంత వరెస్ట్ గా తయారయ్యారు ఏంట్రా.. లిఫ్ట్‌లో ఆ పని కనివ్వద్దం ఏంటయ్యా?

ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన జీవితంలో భాగంగా మారింది.రోజు రోజుకూ ఇందులో విభిన్నమైన వీడియోలు, వార్తలు వైరల్ అవుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కొన్ని నవ్వించే వీడియోలు మనలో హాస్యం రేకెత్తిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి, ఆవేదనకు కూడా గురిచేస్తున్నాయి.

అటువంటి ఘటనల్లో తాజాగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా ఓ లిఫ్ట్‌లో వ్యక్తి టాయిలెట్(Person Toilet In The Elevator) చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో మొదటగా ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్‌లోకి ( Elevator)ప్రవేశించారు.కొద్దిసేపటి తరువాత ఒకరు బయటకు వెళ్లారు.

ఆయన వెనకాల వచ్చిన వ్యక్తి తిరిగి లిఫ్ట్‌లోకి ప్రవేశించి, ఓ మూలన నిలబడి టాయిలెట్ చేశాడు.

అంతటితో ఆగకుండా, తన వల్ల ఏర్పడిన మలినాలను కాలితో బయటకు తోసి, నిర్లక్ష్యంగా లిఫ్ట్ నుంచి వెళ్లిపోయాడు.

అతడు చేసిన పని సీసీటీవీ కెమెరాలో(CCTV Camera) రికార్డవుతుందన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడు.

ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

"""/" / ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కొందరు వ్యక్తిని తప్పుపడుతూ ఇది అసభ్యకర చర్య అని పేర్కొంటుండగా, మరికొందరు మాత్రం సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఈ చర్య వెనుక ఉన్న అసలైన సమస్యను గుర్తు చేస్తున్నారు.

నిజానికి ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడో ఖచ్చితంగా తెలియదు కానీ.ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందని, మనకు తగినంత పబ్లిక్ టాయిలెట్లు (Public Toilets)లేవని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరేమో ఇలాంటి వాళ్లకు తగిన శిక్ష వేయాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. """/" / ఈ సంఘటన మన సమాజంలో ఉన్న ప్రాథమిక సౌకర్యాల కొరతను తెరపైకి తెచ్చింది.

ఇది వ్యక్తిగత బాధ్యత లేకపోవడం అయినా కావచ్చు, లేదా అనివార్య పరిస్థితుల్లో వ్యక్తి చేసిన చర్య కావచ్చు.

కానీ, దీనివల్ల కలిగే అసౌకర్యం, సమాజంపై దాని ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంటుంది.

అందుకే ఇటువంటి చర్యలపై ఆలోచించడమే కాదు, ప్రభుత్వాధికారులు, పౌరులు కలిసి శుభ్రతపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.