నిద్రించే ముందు చాక్లెట్స్ తింటే ఏం అవుతుందో తెలుసా?

చాక్లెట్స్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు.పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా చాక్లెట్స్‌ను ఇష్టంగా తింటుంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు చాక్లెట్స్ అంటేనే ప‌డి చ‌చ్చిపోతుంటారు.ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఎన్నో ర‌కాల చాక్లెట్స్ ఉన్న‌ప్ప‌టికీ హెల్త్‌కు మేలు చేసేవి మాత్రం డార్క్ చాక్లెట్సే.

డార్క్ చాక్లెట్స్ ను త‌గిన మోతాదు ప్ర‌తి రోజు తీసుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు.

త‌ద్వారా బ్రెయిన్ యాక్టివ్‌గా ప‌ని చేస్తుంది, ఒత్తిడి డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి, గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది, నిరుత్సాహన్ని నిరోధించ‌వ‌చ్చు.

ఇలా ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు.చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివే అయిన‌ప్ప‌టికీ వాటిని తీసుకునే టైమ్ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

సాధార‌ణంగా చాలా మంది రాత్రి నిద్రించే ముందు చాక్లెట్స్ తింటుంటారు.కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

వాస్త‌వానికి చాక్లెట్స్‌లో కెఫిన్ స్థాయి చాలా అధికంగా ఉంటుంది.ఈ కెఫిన్ నిద్ర రానీయ‌కుండా అడ్డుకుంటుంది.

దాంతో శ‌రీరం తీవ్రంగా అల‌సిపోయిఅనారోగ్యానికి గురికావాల్సి వ‌స్తుంది.అందుకే నైట్ నిద్రించే ముందు ఎట్టి ప‌రిస్థితుల్లో చాక్లెట్స్ జోలికి వెళ్ల కూడ‌దు.

"""/" / చాక్లెట్స్ మాత్ర‌మే కాదు నిద్రించే ముందు ఇంకొన్ని ఆహారాల‌కు కూడా దూరంగా ఉండాలి.

వాటిలో ఐస్ క్రీం ఒక‌టి.అవును, తెలిసో.

తెలియ‌కో చాలా మంది నైట్ ఫుడ్ త‌ర్వాత ఐస్ క్రీం లాగించేస్తారు.కానీ, ఐస్ క్రీంలో ఉండే ఫ్యాట్స్ త్వ‌ర‌గా జీర్ణం కాకుండా ఇబ్బంది పెడ‌తాయి.

దాంతో మీ నిద్ర చెడుతుంది.అలాగే చాలా మందికి నిద్రించే ముందు స్వీట్స్ తీసుకునే అల‌వాటు ఉంటుంది.

కానీ, స్వీట్స్‌లో ఉండే షుగ‌ర్స్.బ‌రువును పెరిగేలా చేస్తాయి.

ఇక వీటితో పాటు చిప్స్, సిట్రిక్ పండ్లు, టమోటాలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, టీ, కాపీ, ఆల్క‌హాల్‌, రెడ్ మీట్ వంటి వాటికి కూడా నైట్ టైమ్ దూరంగా ఉండాలి.

ఎందుకంటే, ఇవి నిద్ర పట్టకుండా చేయ‌డం లేదా నిద్ర నాణ్యత దెబ్బ తీయ‌డం చేస్తుంటాయి.

కొత్త రకం డైపర్స్ లాంచ్ చేసిందని జపాన్… వీటి ప్రయోజనాలు ఏంటంటే..