శరీరానికి జింక్ ఎందుకు అవసరం.. అది ఏయే ఆహారాల్లో ఉంటుంది?

జింక్( Zinc ).మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి.

సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి.అందుకు విటమిన్ సి తీసుకోవాలి.

ఇది అందరికీ తెలుసు.కానీ విటమిన్ సి మాత్రమే కాదు జింక్ కూడా ఇమ్యూనిటీ సిస్టం ని బలోపేతం చేస్తుంది.

అలాగే గాయాలను త్వరగా నయం చేయడానికి, ప్రోటీన్ సంశ్లేషణకు, గుండె ఆరోగ్యానికి, కణ విభజనకు జింక్ చాలా అవసరం.

అంతేకాకుండా జింక్ జీర్ణ వ్యవస్థ ( Digestive System )పని తీరును మెరుగుపరుస్తుంది.

హైపో థైరాయిడ్( Hypo Thyroid ) నివారణకు సహాయపడుతుంది.కంటి చూపును పెంచుతుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా జింక్ సహాయపడుతుంది.అటువంటి జింక్ ను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

జింక్ లోపిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అందుకే జింక్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

మరి ఇంతకీ జింక్ ఏయే ఆహారాల్లో మెండుగా ఉంటుందో తెలుసుకుందాం పదండి. """/" / జీడిపప్పు.

జింక్ కు గొప్ప మూలం.జీడిపప్పును( Cashew ) మీరు నానబెట్టి తీసుకోవచ్చు లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు.

అలాగే జింక్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో పాలకూర ఒకటి.వారానికి కనీసం రెండు సార్లు అయినా పాలకూరను తీసుకుంటే జింక్ లోపం తలెత్తకుండా ఉంటుంది.

గుమ్మడి గింజల్లో( Pumpkin Seeds ) కూడా జింక్ ఉంటుంది.సాయంత్రం వేళలో చిరుతిండిగా గుమ్మడి గింజల‌ను తీసుకుంటే జింక్ తో సహా బోలెడు పోషకాలు మీ శరీరానికి లభిస్తాయి.

"""/" / ఇవే కాకుండా మాంసాహారంలో, నత్తగుల్లల్లో జింక్‌ మెండుగా ఉంటుంది.కాయధాన్యాలు, పప్పు దినుసులు, బాదం పప్పు, వాల్ నట్స్, పుట్టగొడుగులు, అవకాడో, జామ, పుచ్చ గింజలు, గుడ్డు, పాలు, ప‌న్నీర్‌, వేరుశన‌గ‌లు మొదలైన ఆహారాల్లో జింక్ నిండి ఉంటుంది.

డార్క్ చాక్లెట్ ద్వారా కూడా మ‌నం జింక్ ను పొంద‌వ‌చ్చు.కాబ‌ట్టి, జింక్ లోపానికి గురికాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ కు త‌ప్ప‌క తీసుకోండి.

కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?