రాజమౌళి సినిమాలకి తన స్టాంప్ ఎందుకు వేస్తాడంటే..?
TeluguStop.com
ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తూనే ఉన్నాయి.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఆర్ అర్ అర్(RRR) సినిమా వరకు అన్ని సక్సెస్ లే.
ఆయనకి సినిమాలు ఎలా తీయాలో తెలుసు సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉంటే జనాలు హై ఫీల్ అవుతారో కూడా తెలుసు జనాల నాడీ తెలిసిన డైరెక్టర్ అందుకే ఆయన సినిమాలకి అంత క్రేజ్ ఉంటుంది.
ఆయన ప్రతి సినిమా కి ఎస్ ఎస్ రాజమౌళి అనే ముద్ర ఉన్న ఒక స్టాంప్ పడుతూ ఉంటుంది అది దేనికోసం వేస్తున్నారు అని రాజమౌళి గారిని అడిగితే ఆయన కెరియర్ మొదట్లో సినిమాలు తీసినప్పుడు """/" /
ఊళ్ళల్లో ఉన్న చదువు రాని వ్యక్తులకు ఆయన సినిమా పేర్లు అర్థంకావు అందుకని తను తీసే సినిమాల పేర్లు చదవరాకపోయిన అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాంప్ ఆలోచన వచ్చి పెట్టారట అప్పుడు పేరు చదవరాకపోయిన కనీసం ఆ పోస్టర్ల మీద ఆ ముద్ర చూసి అయిన తన సినిమా అని గుర్తు పడతారు కదా అలా గుర్తుపట్టి తన సినిమాకి వస్తారని అలా పోస్టర్ల మీద ముద్ర వేశారట.
"""/" /
కానీ ఆ తరువాత అది తీసెద్ధాం అన్న తీసివేయకుండ ఒక బ్రాండ్ లా మారిందని చెప్పాడు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో(Mahesh Babu) చేయాల్సిన సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు రాజమౌళి.
ఆయన సినిమా వస్తుంది అంటే అందరూ అటెన్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.ఎందుకంటే ఆయన సినిమాల్లో కీ పాయింట్స్ కానీ, ఆయన సినిమా తీసే విధానం గానీ సగటు ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుంది.
కాబట్టే ఆయనకి అంత సక్సెస్ రేట్ ఉంది.
చర్చిలోకి చొరబడిన దొంగ.. పాస్టర్ మార్షల్ ఆర్టిస్ట్ కావడంతో దిమ్మతిరిగిపోయింది..!