పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయ‌డం వెనక ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా?

మన హిందూ సంప్రదాయంలో మన కంటే పెద్దవారి కాళ్ళకు వంగి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవటం ఉంది.

మన దేశంలో ఈ ఆచారం చాలా వర్గాల్లో ఉంది.ఇలా పెద్దవారికి నమస్కారం చేయటం వలన వారి ఆశీస్సులు పిల్లలకు లభించటమే కాకుండా సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని నమ్మకం.

కాళ్ళకు వంగి నమస్కారం చేయటం వెనక శాస్త్రీయమైన కారణాలే కాకుండా ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.మన శరీరంలో పాదాలు అనేవి మొత్తం శరీర బరువును మోస్తాయి.

అవి లేకుండా మనం నిలబడలేము.అందువల్ల అటువంటి పాదాలకు నమస్కారం చేయాలనీ శాస్త్రం చెప్పుతుంది.

అందుకే పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తాం.పెద్దవారి పాదాలకే ఎందుకు నమస్కారం చేయాలనీ ఆలోచిస్తున్నారా? ఆ విషయానికి వస్తున్నా.

పెద్దవారికి జీవిత అనుభవం మరియు పిల్లల కంటే ఎక్కువ జ్ఞానం,అవగాహనా ఉంటాయి. """/"/ అటువంటి పెద్దవారికి నమస్కారం చేస్తే వారి నుంచి పిల్లలకు జీవిత అనుభవం, తెలివి, జ్ఞానం వచ్చి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తారు.

పెద్దవారి పాదాలకు నమస్కారం చేసినప్పుడు పిల్లల్లో ఉండే పాజిటివ్ శక్తి పెద్దవారికి,పెద్దవారిలో ఉండే పాజిటివ్ శక్తి పెద్దవారికి ప్రసారం అయ్యి కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

పాదాలకు వంగి నమస్కారం చేయటం వలన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట.

నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి