వేప చెట్టు రావి చెట్టుకు పెళ్లి చేయడానికి కారణం..!

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.ఆ విధంగా దైవ సమానం గా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

ఆ విధంగా దేవతా వృక్షాలుగా భావించే వాటిలో వేప చెట్టు రావి చెట్టు ఒకటని చెప్పవచ్చు.

ఈ రెండు చెట్లను పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

అంతే కాకుండా మరికొందరు ఈ రెండు చెట్లకు వివాహం కూడా జరిపిస్తారు.ఈ విధంగా రావిచెట్టుకు వేప చెట్టుకు పూజలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం .

మన పురాణ ఇతిహాసాల ప్రకారం రావిచెట్టు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంశంగా భావిస్తారు.

రావిచెట్టు అణు వణువులోను ఆ నారాయణుడు, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రావి చెట్టు మొదలులో బ్రహ్మదేవుడు, కాండంలో పరమేశ్వరుడు, చెట్టు కొమ్మలలో నారాయణుడు కొలువై ఉంటాడని చెబుతారు.

అదే విధంగా ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.

మరి వేప చెట్టును మన సాంప్రదాయం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు.

పురాణాల ప్రకారం రెండు వృక్షాలు దైవ సమానమైనవి కాబట్టి ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు, సంతానం లేని వారు పూజించడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.

అదేవిధంగా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటు చేసుకోకుండా వారి సంసార జీవితం సుఖంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా చాలా మంది ఈ వృక్షాలకు వివాహం జరిపిస్తారు.ఈ విధంగా ఈ వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి జరిపించడం వల్ల సకల సంపదలతో సుఖంగా ఉంటారని నమ్మకం.

అదే విధంగా ఎవరి జాతకంలోనైనా వివాహ దోషం ఉన్నట్లయితే అటువంటి వారు ఈ రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి చేయించడం ద్వారా దోష ప్రభావం తొలిగిపోయి తొందరలోనే వివాహ ఘడియలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Lemon Crop : నిమ్మ తోటల్లో పూత నియంత్రణ యాజమాన్యంలో పాటించాల్సిన సరైన మెళుకువలు..!