ఇంటి గుమ్మానికి నిమ్మకాయ -మిర్చి కట్టడానికి అసలు కారణం ఇదే!

మన దేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు.ఆచార వ్యవహారాలతో పాటు, కొన్ని నమ్మకాలను కూడా ఎంతగానో విశ్వసిస్తారు.

అయితే ఆచారాల వెనుక ఉన్న అర్థం మాత్రం ఎవరికీ తెలియదు.ఏదో మన పెద్దవారు చెప్పారు కనుక వాటిని పాటిస్తున్నాము అనే ధోరణిలో ఉంటారు తప్ప వాటి వెనుక ఉన్న సరైన అర్థం మాత్రం చాలా మందికి తెలియదు.

ఇలా చాలామంది ఇంటి గుమ్మానికి నిమ్మకాయ మిర్చి కట్టడం మనం చూస్తూ ఉంటాము.

అయితే ఇలా నిమ్మకాయ, మిర్చి కట్టడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

ఇలా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడంవల్ల మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి తగలదని, ఎలాంటి ఆత్మలు, ప్రేతాత్మలు దరి చేరవని చెబుతారు.

నిజానికి అసలు కారణం ఇదికాదు.పూర్వకాలంలో ప్రతి ఒక్కరు మట్టి ఇంటిలో నివసించే వారు.

రాత్రి సమయంలో కూడా కరెంటు లేకపోవటం వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంటిలోకి వచ్చేవి.

అయితే ఈ క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలను మిరపకాయలను సూదితో గుచ్చడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనలు బయటకు వెదజల్లడం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరవు.

ఈ కారణం చేత పూర్వకాలంలో పెద్దవారు ఇంటి గుమ్మానికి పచ్చిమిరపకాయలు నిమ్మకాయను దారంతో వ్రేలాడ తీసేవారు.

"""/" / ప్రస్తుతం ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా కొందరు పాటిస్తూ ఉంటారు.

అయితే ఇలా కట్టడం వెనుక ఉన్న అసలు కారణం తెలియనప్పటికీ, ఎలాంటి చెడు ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం ఇంటిపై పడకుండా ఉండటం కోసం కడతారని భావించి ప్రతి అమావాస్యకు కొత్త నిమ్మకాయ పచ్చి మిరపకాయలను ఇంటి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు.

పంజాబ్ కింగ్స్ ఓటమికి ముంబై గెలుపుకి ఇదెక్కోటే కారణం…