చెట్లలోని ఈ సర్కిల్స్ ఏమి చెబుతాయో తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు!
TeluguStop.com
చెట్ల కాండంలో కనిపించే సర్కిల్స్ ఆ చెట్టుకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాయి.
ఈ సర్కిల్‌లు దాని వయస్సు గురించి మాత్రమే సమాచారాన్ని ఇస్తాయని చాలా మంది అనుకుంటారు.
అయితే ఇది ఒక్కటే కాదు ఆ రింగ్స్ చెట్టు ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి.
దానికి ఎప్పుడు జబ్బు చేసింది? లాంటి విషయాలు తెలియజేస్తుంది.కొన్నిసార్లు చెట్లకు కూడా అనారోగ్యం వాటిల్లుతుంది.
సైన్స్ కోణం నుంచి చెట్ల కాండంలో రూపొందే రింగ్ ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టు లోపలి భాగంలో కనిపించే ఈ రింగ్ చాలా విషయాలు చెబుతుంది.ఇది అనేక నమూనాలలో కనిపిస్తుంది.
లేత రంగు, ముదురు రంగు.రింగ్ వెడల్పు మొదలైనవి ప్రతి చెట్టుకు ప్రత్యేకంగా కనిపిస్తుంది.
దీని వెడల్పు చెట్టు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.చెట్లు కరువును ఎదుర్కొన్నాయి? లేదా తగినంత సూర్యరశ్మి అందలేదా అనే విషయాలు తెలియజేస్తాయి.
చెట్టు కాండంలో కనిపించే ఈ వృత్తం వెడల్పు ఎక్కువగా ఉంటే, అది పెరగడానికి అవసరమైన ప్రతిదీ తగినంత పరిమాణంలో అందిందని గ్రహంచివచ్చు.
అదే సమయంలో చాలా సన్నని రింగులు కనిపిస్తే.అది చాలా అనారోగ్యంతో ఉన్నదని అర్థం.
అది తీవ్రమైన చలితో దెబ్బతిందని, ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కొందని గ్రహించవచ్చు.అది దాని పెరుగుదలపై ప్రభావం చూపిందని తెలుసుకోవచ్చు.
ఈ రింగులను లెక్కించడం ద్వారా చెట్టు వయస్సును ఎలా గ్రహించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టుకాండంలో కనిపించే రింగుల సంఖ్య దాని వయస్సుతో సమానంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.
అయితే ఇది సరైనది కాదు.దాని వయస్సును లెక్కించడానికి రింగుల సంఖ్యను లెక్కించడం, కాండం వెడల్పును గమనించడం ద్వారా దాని సగటు వయసును లెక్కించవచ్చు.
ఈ విధంగా దాని వయస్సు తెలుస్తుంది.చెట్లలో కనిపించే ఈ వృత్తాల సహాయంతో వాతావరణ మార్పుల గురించి చాలా ముఖ్యమైన విషయాలు గ్రహించవచ్చని అమెరికన్ శాస్త్రవేత్తలు తమ ఇటీవలి పరిశోధనలో వివరించారు.
వాతావరణంలో వచ్చిన మార్పులను ఆ చెట్టు ఎంతమేరకు తట్టుకుంటుందో ఈ వృత్తాల ద్వారా తెలుసుకోవచ్చని వారు తెలిపారు.