పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

పిల్ల‌ల ఆరోగ్యం విష‌యంలో, తీసుకునే ఆహారం విష‌యంలో త‌ల్లిదండ్రులే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే, పిల్ల‌లు త‌మ ఆరోగ్యంపై శ్రద్ధ చూప‌లేరు.అంత అవ‌గాహ‌న కూడా వారికి ఉండ‌దు.

అందువ‌ల్ల‌ త‌ల్లిదండ్రులే పిల్ల‌ల విష‌యంలో కేర్ తీసుకోవాలి.అలాగే పిల్ల‌ల‌కు మొద‌టి ఏడాది ఇచ్చే ఆహార‌మే వారి ఆరోగ్యానికి పటిష్టమైన పునాది అవుతుంది.

కాబ‌ట్టి, ఆ స‌మ‌యంలో త‌ల్లి పాల‌తో పాటు తేలిక‌గా జీర్ణం అయ్యే ఇతర ఆహారాలు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే చాలా మంది చేసే పొర‌పాటు.పాల‌లో పంచ‌దార లేదా బెల్లం క‌లిపి తీపిని పిల్ల‌ల‌కు అల‌వాటు చేస్తారు.

అలాగే వేరే వేరే విధాలుగా కూడా పిల్ల‌ల‌కు తీపి ప‌దార్థాలు ఇస్తుంటారు.కానీ, చిన్న వ‌య‌సులోనే పిల్ల‌ల‌కు తీపి ప‌దార్థాలు ఇవ్వ‌డం ఏ మాత్రం మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పాలు, ఘనాహారం ద్వారా బెల్లం లేదా చక్కెర పిల్ల‌ల‌కు పెడితే.వారు తీపి పదార్థాలు మాత్రమే ఇష్టం అవుతాయి.

"""/"/ తర్వాత తర్వాత మిగతా రుచులను ఇష్టపడరు.దాంతో అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అలాగే పిల్ల‌ల‌కు తీపి ప‌దార్థాలు ఇవ్వ‌డం వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి.

వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.అందుకే కనీసం ఐదో సంవత్సరం వచ్చే వరకు రోజు వారీ ఆహారంలో తీపి పదార్థాలను ఇవ్వ‌కుండా ఉండట‌మే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పంచ‌దార, బ‌ల్లంకు బ‌దులుగా న్యాచుర‌ల్ స్వీట్స్ అంటే అర‌టి పండు, ఆపిల్ వంటి పెడితే వారి ఆరోగ్యానికి మేల‌ని అంటున్నారు.

ఇక పిల్ల‌ల‌కు ప‌ళ్లు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి వైట్ రైస్‌, ర‌సం, ఉడికించిన కూరగాయలు, పండ్ల గుజ్జు, ట‌మాటా సూపులు వంటి పెట్టాలి.

ప‌ది నెల‌లు దాటిన ద‌గ్గ‌ర నుంచి ఇడ్లి, దోస, చిరు ధాన్యాలు, పెరుగన్నం వంటివి పెట్టాలి.

అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు,, వాల్న‌ట్స్ ఇలాంటి కలిపి రవ్వలా చేసి.

ఉడికించి పిల్ల‌ల‌కు పెడితే వారి ఎదుగుద‌ల మంచిగా సాగుతుంది.

హనుమాన్ జయంతి శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే..!