ఆడవారు గాజులు, పట్టీలు ఎందుకు ధరిస్తారు ? దీని వెనుక దాగున్న సైన్స్ ఏమిటి ?

ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు.ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి.

ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు.గాజులు అంటే చాలామందికి చులకన.

"గాజులు తొడుక్కొని కూర్చో" అనే డైలాగ్ ఒకరిని అవమానించడానికి వాడుతుంటారు.అంటే గాజులు తొడిగేవారు ఇంట్లో ఉండటం తప్ప ఇంకేమి పని చేయలేరు అని వారి అర్థం.

ఈ అర్థం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ దాగి ఉంది.పూర్వం బయటి పని ఎక్కువ మగవారే చేసేవారు.

దాంతో వారికి బ్లడ్ సర్కిలేషణ్ బాగా జరిగేది.కాని ఆడవారు ఇంట్లో ఎక్కువ ఉండటం వలన రక్తప్రసరణ సమస్యల బాధ ఉండేది.

అప్పటినుంచే ఆక్యుప్రెషర్ టెక్నిక్ మొదలుపెట్టారు.అంటే శరీరంలో కొన్ని చోట్ల ఒత్తిడి పెంచడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని ఈ ఆక్యుప్రెషర్ టెక్నిక్ చెబుతుంది.

ఇది కేవలం భారతదేశంలోనే కాదు, చైనాలో కూడా బాగా పాపులర్.కాని చైనా వారు ఈ గాజులు, పట్టీలు పట్టించుకోరు.

చేతులతోనే కొన్ని ప్రదేశాల్లో ఒత్తిడి తెస్తారు.మనవారు అంత కష్టం ఎందుకు అని గాజులు, పట్టీలు తొడగడం మొదలుపెట్టారట.

రాను రాను అవే అలంకారాలుగా మారాయి.మహిళల జీవితంలో ఓ భాగం అయిపోయాయి.

ఈ చేతిలో గాజులు, కాలికి పట్టీలు కొన్ని నరాలని ఎప్పుడు తాకుతూ ఉంటాయి.

దాంతో ఆక్యుపంక్చర్ టెక్నిక్ ద్వారా బ్లడ్ సర్కిలేషణ్ సరైన ట్రాక్ లో ఉంటుందని పూర్వం భావించేవారు.

ఇప్పుడు కూడా ఆక్యుప్రెషర్ కొన్ని చికిత్సలకి ఉపయోగిస్తారు.వెండితో చేయించే ఆ పట్టీలు ఎప్పుడు గలగలా చప్పుడు చేస్తూ ఉంటాయి.

దాంతో ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, మహిళలు సంతోషంగా ఉంటే, ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలు అభిప్రాయడేవారు.

ఈ పట్టీల వలన కాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయని, అంతే కాకుండా ఈ ఆక్యుప్రెషర్ వలన రక్త ప్రసరణ బాగా జరిగి మహిళల హార్మోన్స్ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భ సమస్యలు, మూడ్ స్వింగ్ సమస్యలు కంట్రోల్ లో ఉంటాయని కూడా చెబుతారు.

ఇందులో నిజానిజాలు ఏంటో మనకు సరిగా తెలియవు కాని, అక్యుప్రెషర్ సంగతి పక్కనపెడితే, పట్టీలు వలన గాయాలు అవుతుంటాయి, గాజులు టైట్ గా ఉంటే రక్తప్రసరణకు ఇబ్బందే.

కాబట్టి సంప్రదాయాలని పాటించడం తప్పు కాదు, అవి మనకు నష్టం చేయకుండా పాటించాలి.

ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అమ్మాయిలు.

ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవి..: సీఎం జగన్