చనిపోయిన వారిని హిందువులు దహనం చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

భారతదేశంలో పుట్టిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయమే హిందూ మతం.ఈ హిందూమతంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఆచారంలో భాగంగానే హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ మతస్తులు ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కారాలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

ఈ విధంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు ఎందుకు చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు.

అయితే చనిపోయిన వారికి ఈ విధంగా దహన సంస్కరణలు ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు వారి వారి మతాలకు అనుగుణంగా సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు.

ఈ క్రమంలోనే హిందువులు మరణించిన తరువాత దహన సంస్కారాలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అవి ఏమిటంటే.మనిషి జీవించి ఉన్నప్పుడు తనకు తెలిసి తెలియకుండా ఎన్నో పాపాలను చేస్తారు.

ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తర్వాత అతనిని అగ్నిలో దహించి వేయటం వల్ల అతడు జీవించి ఉన్నప్పుడు చేసిన పాపాలు మొత్తం నశించిపోయి వచ్చే జన్మలో పరిశుద్ధమైన ఆత్మతో ఈ భూమిపై పుడతాడని నమ్మకం.

అందుకోసమే చనిపోయిన వారిని దహనం చేస్తుంటారు.చనిపోయిన వారిని ముఖ్యంగా నదులు, చెరువులు, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో మాత్రమే దహనసంస్కారాలు చేస్తుంటారు.

"""/"/ ఈ విధంగా నీరు ఉన్నచోట దహనసంస్కారాలు చేయటం వల్ల వారి ఆత్మ పరిశుద్ధం అవడమే కాకుండా చనిపోయిన వ్యక్తి నుంచి ఆత్మ బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా దహనం చేయాలని భావిస్తారు.

ఈ విధంగా దహనసంస్కారాలు చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి అస్తికలను నీటిలో కలుపుతారు.

ఈ విధంగా నీటిలో కలపడం వల్ల ఆత్మ అంది పంచభూతాలలో కలుస్తుందనేది నమ్మకం.

ఇక చివరిగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు విముక్తి కలిగి వారి ఆత్మ మరొక శరీరం లోనికి ప్రవేశిస్తుంది.

ఈ విధంగా మనిషి చనిపోయినప్పుడు చేసే ఈ ఆచారాలు అన్నింటినీ కలిపి అంతిమ సంస్కరణలుగా భావిస్తాము.

నాలుగేళ్లలోనే పోలీస్ అవతారం ఎత్తాడు.. కేసులు సాల్వ్ చేశాడు..?