గురు పౌర్ణమి రోజున భక్తులు సాయిబాబాను ఎందుకు పూజిస్తారంటే..?

గురుఃబ్రహ్మ, గురుఃవిష్ణు, గురుదేవో మహేశ్వరః అంటూ మన పెద్దలు గురువు విశిష్టత గురించి తెలియజేశారు.

అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం.అటువంటి గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుందని వేదవాక్యం.

అందుకే హిందూ ధర్మంలో గురువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ధర్మ శాస్త్రాలు ప్రకారం వ్యాసమహర్షినీ గురువుగా భావిస్తారు.

అందుకే ఆయన ఆవిర్భవించిన జన్మతిథి ఆషాఢపౌర్ణమిని గురు పౌర్ణమి( Guru Purnima ) గా జరుపుకుంటూ ఉన్నారు.

సాక్షాత్తు ఆ పరమశివుడే వ్యాసుని రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. """/" / కాబట్టి వ్యాసపౌర్ణమి రోజున గురువును పూజిస్తే పరమేశ్వరున్ని పూజించిన పుణ్య ఫలితం దక్కి మంచి జ్ఞానం కలుగుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే గురువు మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానం అనే వెలుగుని నింపుతాడని ప్రజల నమ్మకం.

ప్రస్తుత రోజులలో చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు.

కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు.1906వ సంవత్సరంలో ఆషాడ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా( Sai Baba ) తన భక్తులలో ఒకరైన పిలిచి ఆరోజు గురువుల పండుగని గురువును పూజించాలని అందుకు కావలసిన పూజ సామాగ్రి ఏర్పాటు చేసి భక్తులందరినీ పిలువమని కోరుతారు.

"""/" / అయితే భక్తులు( Devotees ) గురువుగా ఎవరికి పూజ చేయాలా అని సందేహిస్తూ ఉంటే అప్పుడు సాయిబాబా మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు.

కానీ నేను మిమ్మల్ని సక్రమ మార్గంలో నడిపేందుకు వచ్చిన గురువుని అని చెప్పడంతో ఆ రోజు నుంచి గురుపౌర్ణమి రోజున సాయిబాబాను పూజించడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం గురు పౌర్ణమి రోజు షిరిడి సాయిబాబానీ మాత్రమే కాకుండా సత్యసాయి బాబా, భగవాన్ వెంకయ్య స్వామి, అచలానంద స్వామి ఇలా అనేక మందినీ వేల మంది భక్తులు గురు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు.

డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!