రహనే ఆ కేక్ ను ఎందుకు కట్ చేయలేదంటే..!

ఇటీవల అజింక్యా రహానె ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని వచ్చారు.ఇక ఆస్ట్రేలియాతో జరిగిన బార్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్టు సిరీస్‌ లో భార‌త్ ఘన విజయం సాధించింది.

ఈ తరుణంలో భార‌త జ‌ట్టుకు ఇన్చార్జి కెప్టెన్‌ గా అజింక్యా ర‌హానే బాధ్యతలు వహించారు.

ఈ టెస్ట్ లో భారత్ విజయం సాధించడంతో పలువురు రహానే కు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇంతటి ఘన విజయం సాధించిన రహానే కి కుంటుంబ సభ్యులతో పాటు, స్థానిక దాదర్‌ లోని అతడి కాలనీ వాసులు ఘనంగా స్వాగతించారు.

అంతేకాదు కేక్‌ తెప్పించి వారు దానిని కట్‌ చేయాల్సిందిగా అజింక్యాను కోరారు.అయితే ఆ కేక్‌ పై భారత పతకాన్ని చేబూనిన కంగారూ బొమ్మ ఉండడంతో.

దానిని కట్‌ చేసేందుకు రహానే నిరాకరించాడు. """/"/ అయితే కంగారూ ఆస్ట్రేలియాకు జాతీయ చిహ్నం కావడం, ఆ దేశ కరెన్సీ పైనా ముద్రించి ఉండడంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన కొన్ని సంస్థలు కంగారూను తమ లోగోగా ఉపయోగిస్తున్నాయి.

మన దేశంలో జాతీయ పక్షి, జాతీయ జంతువు గాని అవమానం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని జైల్లో పెడుతుంటాము.

అలాగే మన దేశ జాతీయ పక్షులకు ఎంత ప్రాముఖ్యత ఇతర దేశాల జంతువులకు అంతే ఇస్తున్నారు రహానే.

ఈ నేపథ్యంలోనే ఆ జంతువు బొమ్మ ఉన్న కేక్‌ ను రహానే కట్‌ చేసేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది.

అంతేకానీ గెలుపు, ఓట‌ముల‌ను ప‌ర్స‌న‌ల్ గా తీసుకోకూడ‌దని రహానే వెల్లడించారు.దాంతో ఆ బొమ్మను తీసేశాక రహానే కేక్‌ కట్‌ చేశాడు.

ఇక ర‌హానే అలా చేయ‌డం ప‌ట్ల అంద‌రూ అత‌న్ని మరోసారి మెచ్చుకుంటున్నారు.ఇక ర‌హానే ఇత‌ర దేశాల‌కు, వారి ఆచార వ్య‌వ‌హారాల‌కు కూడా విలువ ఇస్తాడ‌ని అత‌న్ని అభినందలు చేశారు అభిమానులు.

ఇక క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని, ర‌హానే రియ‌ల్ జెంటిల్ మెన్ అనిపించుకున్నాడ‌ని అంద‌రూ అత‌న్ని పొగుడుతున్నారు.

ఇదేందయ్యా ఇది.. ఆ దేశంలో పారాసెటమాల్‌ కలిపిన ఐస్‌క్రీమ్ అమ్ముతారు..?