వరుణ్ – లావణ్య పెళ్ళికి ఎన్టీఆర్ అందుకే వెళ్లలేదా.. కారణం ఇదే!
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) పర్సనల్ లైఫ్ లో ఒక అడుగు ముందుకు వేసాడు.
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయ్యాడు.
పెద్దల సమక్షంలో తాను లవ్ చేసిన అమ్మాయిని మూడుముళ్లు వేసి తన భాగస్వామిగా మలచుకున్నాడు.
వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya Tripathi ) ని లవ్ చేసిన విషయం ఎంగేజ్మెంట్ తోనే బయటకు వచ్చింది.
జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా నవంబర్ 1న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఇటలీలో వీరి పెళ్లి గ్రాండ్ గా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరిగింది.
ఇక ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మెగా, అల్లు ఫ్యామిలీలు అంత కలిసి ఈ వేడుకలో సందడి చేసారు.ఇక పెళ్లి ఘట్టం ముగియడంతో నవంబర్ 5న రిసెప్షన్ గ్రాండ్ గా ఇక్కడ హైదరాబాద్ లో జరగనుంది.
ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలిరానుంది. """/" /
ఇదిలా ఉండగా ఈ పెళ్ళికి ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది.
స్వయంగా మెగా కుటుంబం వెళ్లి పెళ్ళికి ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారట.అయితే ఎన్టీఆర్ వీరి పెళ్ళికి వెళ్ళలేదు.
దీంతో మెగా ఫ్యాన్స్ ఈయనపై ఆగ్రహంగా ఉన్నారు.కానీ ఎన్టీఆర్ పెళ్ళికి వెళ్లకపోవడానికి వేరే కారణం ఉందట.
"""/" /
అనుకోని పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ హాజరు కాలేక పోయారని తెలుస్తుంది.
దేవర షూట్ వల్లనే ఎన్టీఆర్ రాలేనని చెప్పినట్టు తెలుస్తుంది.అయితే రెసెప్షన్ కు మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పారట.
ప్రస్తుతం దేవర షూట్ కోసం ఎన్టీఆర్ గోకర్ణ వెళ్ళాడు.అక్కడే కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.
షూట్ పూర్తి కాగానే నవంబర్ 5న హైదరాబాద్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టనున్నారట.
ఇది అసలు కారణం అని తెలుస్తుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024