చిరు మాస్టర్ సినిమా కి డైరెక్టర్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గారనే చెప్పాలి.

అయిన ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు మంచి విజయాలు సాధించడమే కాకుండా సినిమాలంటే ఇలా ఉండాలి అనే ఒక ట్రేడ్ మార్క్ ని ఆయన సినిమాల ద్వారా క్రియేట్ చేసిన ఒకే ఒక హీరో.

చిరంజీవి ఆయన నట ప్రస్థానం లో ఆయన సాధించని ఘనత లేదు.ఆయన వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

ఇక ఇప్పటి వరకు ఎవరు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు అంటే చిరంజీవి స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆయన ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన కెరియర్ లో వచ్చిన మాస్టర్ సినిమా ఆయనకి ఎప్పటికీ ప్రత్యేకం అనే చెప్పాలి.

ఎందుకంటే అప్పటివరకు ప్లాపుల్లో ఉన్న చిరంజీవికి హిట్లర్ లాంటి హిట్ సినిమా వచ్చిన తర్వాత వెంటనే మాస్టర్ ( Master )లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా రావడం ఆయన కెరీర్ కి చాలా ప్లస్ అయింది.

"""/" / అయితే మొదటగా మాస్టర్ సినిమాకి రవి రాజా పినిశెట్టి ( Ravi Raja Pinishetti )గారిని డైరెక్టర్ గా తీసుకుందామని చిరంజీవి అనుకున్నారంట కానీ అప్పటికే ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి భాషా సినిమాని డైరెక్షన్ చేసిన సురేష్ కృష్ణ( Suresh Krishna ) గారు డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది.

సురేష్ కృష్ణ అప్పట్లో తీసిన సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి.ఆయన తీసిన చాలా సినిమాలు విజయాలను కూడా అందుకున్నాయి.

అలాగే మాస్టర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయి చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని ప్రూవ్ చేసిన సినిమాగా ఇండస్ట్రీలో నిలిచింది.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?