భయపడుతున్న ఇ వి వి సత్యనారాయణ గారికి ఎస్ వి కృష్ణారెడ్డి గారు ఎందుకు ఆ సినిమా చూపించారంటే..?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు మధ్య సినిమాల పరంగా మంచి పోటీ ఉండేది ఒకరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొడితే మరొకరిది వచ్చి ఆ రికార్డు ని బ్రేక్ చేసేది.

అలా వీళిద్దరి మధ్య స్నేహపూరితమైన పోటీ ఉండేది.వీళ్లిద్దరు పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడుతుంటే ఎస్ వి కృష్ణారెడ్డి, ఇ వి వి సత్యనారాయణ గారి సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది.

ఇద్దరు శ్రీకాంత్, జగపతి బాబు లాంటి సెకండ్ గ్రేడ్ హీరోలతో కామెడీ ఎమోషన్ ని మిక్స్ చేస్తూ మంచి సినిమాలు చేసారు.

అప్పట్లో వీళ్ల సినిమాలకి సపరేట్ గా ఫ్యాన్స్ కూడా ఉండేవారు.అయితే ఇ వి వి గారు మోహన్ బాబు గారి తో చేస్తున్న వీడెవడండీ బాబు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అదే టైం లో ఎస్ వి కృష్ణరెడ్డి శ్రీకాంత్ ని హీరోగా పెట్టి వినోదం అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఇ వి వి గారితో ఎవరో ఒకాయన ఇలా చెప్పారంట తమిళ్ సినిమా అయిన ఉళ్ళతాయి అల్లితా కి రీమేక్ గా మీరు చేస్తున్న వీడెవడండీ బాబు సినిమా సేమ్ స్టోరీ ని ఎస్ వి కృష్ణ రెడ్డి ఫ్రీమేక్ చేస్తున్నారు ఆయనది ఆల్రెడీ షూట్ అయిపొయింది అని చెప్పడం తో ఇ వి వి గారు కంగారు పడిపోయారట.

"""/"/ మన సినిమా సగం షూటింగ్ మాత్రమే అయింది.అక్కడ ఏమో ఎస్ వి కృష్ణరెడ్డి సినిమా ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయింది ఏం చేయాలో తెలియట్లేదు అని ఆయన సన్నిహితుల దగ్గర చెబితే సరే ఆయన్నే డైరెక్ట్ గా అడగండి.

ఒక వేళా ఆ సినిమా ఈ సినిమా స్టోరీ లు రెండు ఒకటే అయితే ఇప్పుడు మన సినిమా షూట్ ఆపేయడమే ఉత్తమం అని ఇ వి వి గారి దగ్గరి మనిషి ఎవరో చెప్పడంతో ఎస్ వి కృష్ణ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఇ వి వి గారు """/"/ఈ సినిమా కి సంభందించిన స్టోరీ గురించి అడిగి తెలుసుకోగా ఎస్ వి కృష్ణ రెడ్డి కథ మొత్తం చెప్పాడట ఈ కథ వేరు మీరు చేసే సినిమా కథ వేరు అని చెప్పడం తో ఆయన కాస్త కుదుటపడ్డాడట ఇది జరిగిన ఒక వారానికి వినోదం సినిమా ప్రివ్యూ వేశారు దానికి ఎస్ వి కృష్ణ రెడ్డి గారు ఇ వి వి గారిని పిలిచి ఆయనకి కూడా ఈ సినిమా చూపించారట ఆ సినిమా చూసిన ఇ వి వి సినిమా బాగుంది మంచి హిట్ అవుతుందని చెప్పి సంతోషం గా వెళ్లి ఆయన సినిమా షూటింగ్ చేసుకున్నారట ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?