సీతాదేవికి అయోనిజ అనే పేరు ఎందుకు వచ్చింది?

శ్రీరామ చంద్రుడి భార్య సీతాదేవి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే.ఆమె ప్రాతివత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అలాగే ఆమె జనక మహారాజు కుమార్తె అని కూడా అందరికీ తెలుసు.కానీ ఆమెను భూదేవి కూతురు అని, అయోనిజ అని ఎందుకు పిలుస్తారో మాత్రం చాలా మందికి తెలియదు.

అసలు ఆమె జనక మహారాజుకు కూతురు అని చెప్తున్నప్పటికీ.భూదేవి కూతురుగా ఎందుకు అభివర్ణిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిథలాపుర నగరానికి రాజైన జనక మహారాజు యాగం చేస్తూ.భూమిని దున్నాడు.

అప్పుడు అతడి నాగలికి ఒక పెట్టె అడ్డు పడింది.విషయం గుర్తించిన జనక మహారాజు ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసి పిల్ల కనిపించింది.

నాగటి చాలులో లభించినందున జనక మహారాజు ఆమెకు సీత అని పేరు పెట్టాడు.అంతే కాదు ఇంటికి తీసుకెళ్లిన ఆన భార్య అయిన సునయనకు విషయం గురించి తెలిపాడు.

అప్పటి నుంచి సీతాదేవి వారి కూతురుగా పెరిగింది.భూమిలో దొరికింది కాబట్టి సీతా దేవిని భూదేవి కుమార్తె అని చెబుతుంటారు.

అంతే కాదండోయ్ సీతా దేవి గర్భము నందు జన్మించలేదు కాబట్టి ఆమెను అయోనిజ అని కూడా పిలుస్తారు.

అంతే కాదండోయ్.శ్రీరామ చంద్రుడితో వివాహం జరిగిన తర్వాత 14 ఏళ్ల వనవాసం అనుభవించిన ఆమె ఆ తర్వాత అగ్ని ప్రవేశం చేసింది.

లవకుషులు పట్టి.రాముడిని కలిసే సమయంలో తన తల్లి అయిన భూదేవితో పాటు భూములోకి వెళ్లిపోయింది.

వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదంటూ లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!