ఎందుకు ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నావంటూ ప్రణీతకు ఎదురైన ప్రశ్న.. సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే?
TeluguStop.com
మామూలుగా హీరోయిన్స్ కు వ్యక్తిగత విషయంలో చాలా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా పెళ్లి కానీ హీరోయిన్స్ కి మాత్రం పెళ్లెప్పుడు అవుతుంది అంటూ ప్రశ్నించి వేధిస్తారు.
ఇక పెళ్లయిన హీరోయిన్లను పిల్లలు ఎప్పుడు కంటున్నారు అంటే ప్రశ్నిస్తారు.ఇలా పెళ్లి అవ్వకున్నా.
పెళ్లి అయినా.వారికి మాత్రం జనాల నుండి ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురవుతాయి.
అయితే కొందరి హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకున్న కష్టమే.ఆలస్యంగా పెళ్లి చేసుకున్న కష్టమే.
ఎందుకంటే ఎందుకు తొందరగా చేసుకున్నారు అంటూ అలా కూడా ప్రశ్నించే జనాలు ఉన్నారు.
తాజాగా అటువంటిదే హీరోయిన్ ప్రణీత కు ఎదురైంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రణీత తన కంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది.
కన్నడ బ్యూటీ అయినా కూడా తెలుగు అమ్మాయిల కనిపిస్తూ తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక ఈ ముద్దుగుమ్మ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు ఏం పిల్లో ఏం పిల్లడో అని సినిమాతో పరిచయమైంది.
ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ.
కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేక పోయింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.
అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
"""/"/
ఇక ప్రణీత ఫౌండేషన్ పేరు మీద చాలా మందికి సహాయం చేస్తుంది.
ఆ తర్వాత ఆమె బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే బడా బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది.
ఆ మధ్యనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఇక తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.
ఇక ప్రణీత పాప పుట్టిన తర్వాత తన మునుపటి రూపాన్ని మళ్లీ కష్టపడి సంపాదించుకుంది.
జిమ్ములలో తెగ వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సొంతం చేసుకుంది.
"""/"/
అయితే ఇదంతా ఆమె మళ్ళీ సినిమాల కోసమే చేస్తుందని తెలిసింది.ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వటం కోసం ఆమె అంతగా కష్టపడుతుందని తెలిసింది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.
ఇక అందులో చాలామంది తమకున్న డౌట్స్ ను అడిగి తెలుసుకున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం మీరు ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని ప్రశ్నించగా.
దానికి ప్రణీత ఏమో అన్నట్లుగా ఎమోజిల ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.అంటే తనకు కూడా తన పెళ్లి ఎందుకు తొందరగా అయిందో అర్థం కావట్లేదు అన్నట్లుగా జవాబు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో లీటరుకు రూ.3కు పైగా భారం